Deccan Mall Collapse Video: దక్కన్ మాల్ కూల్చివేత.. తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : Jan 31, 2023, 4:37 PM IST

దక్కన్ మాల్ కూల్చివేత.. తప్పిన పెను ప్రమాదం

తెలంగాణలోని సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్‌ మాల్‌ను కూల్చి వేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దక్కన్ మాల్ కూల్చి వేస్తుండగా... పెను ప్రమాదం తప్పింది. దక్కన్ మాల్ భవనాన్ని భారీ యంత్రంతో కూల్చి వేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో.. అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు.

దక్కన్ మాల్ కూల్చివేత.. తప్పిన పెను ప్రమాదం

Deccan Mall Collapse Video సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్‌ మాల్‌ను కూల్చి వేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దక్కన్ మాల్ కూల్చి వేస్తుండగా... పెను ప్రమాదం తప్పింది. దక్కన్ మాల్ భవనాన్ని భారీ యంత్రంతో కూల్చి వేస్తుండగా.. ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో.. అక్కడి వారంత భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. ఇక చుట్టుపక్కల ఇళ్లలోని వారిని అంతకుముందే అధికారులు ఖాళీ చేయించారు. దీనితో ప్రాణపాయం జరగలేదనే చెప్పవచ్చు. ఇక భవనం చుట్టు పక్కల పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే ఈ నెల 19న దక్కన్‌ మాల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారీ అగ్ని ప్రమాదం సంభవిచండంతో ఈ భవనం నాణ్యత లోపించడం కారణంగా దీన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. కూల్చివేతకు సంబంధించి రూ. 33.86 లక్షల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్‌ ఇవ్వగా..రూ.25.94లక్షలకే పని చేస్తామని ఎస్‌.కె.మల్లు కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ బుధవారం పని దక్కించుకుంది.

గురువారం ఉదయాన్నే మాల్‌ కూల్చివేతకు యంత్ర సామగ్రితో సిద్ధమైంది. సాయంత్రానికి జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ఎస్‌.కె క్రాంటాక్టును రద్దు చేసింది. టెండరులో పాల్గొని రూ.33లక్షలకు పని చేస్తామన్న మాలిక్‌ ట్రేడర్స్‌కు పని అప్పగించింది. గుత్తేదారు పొడవైన జేసీబీని తెచ్చి పనులు ప్రారంభించారు.మాల్‌కు మాలిక్‌ ట్రేడింగ్‌ అండ్‌ డిమాలిషన్ సంస్థకు కాంట్రాక్టు దక్కడంతో గురువారం రాత్రి 11 గంటల నుంచి కూల్చివేతను ప్రారంభించింది. కూల్చివేత పనులు వేగవంతం చేశారు. ఈరోజు ఎట్టకేలకు దక్కన్ మాల్ భవనాన్ని ఎలాంటి అపాయం లేకుండా కూల్చివేశారు.

ఇక ఈ భవనంలో మంటలు అంటుకుని ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. భవనం మొదటి అంతస్తు లిఫ్టు సమీపంలో శిథిలాలు తొలగిస్తుండగా ఎముకల అవశేషాలు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది, క్లూస్‌ టీం సభ్యులు వాటిని డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. అయితే, ప్రస్తుతం దొరికిన ఎముకల అవశేషాలు ఒక్కరివా? ఇద్దరివా? ముగ్గురివా? ఒక్కరివే అయితే.. ఎవరివి? అన్న అంశాన్ని అంచనా వేయలేకపోతున్నారు. ఇంకా రిపోర్టు రాలేదు. గల్లంతైన వారిపై స్పష్టత లభించకపోగా డీఎన్‌ఏ ఫలితాలను విశ్లేషిస్తేనే మృతుడు ఎవరు అన్న విషయం తేలే అవకాశముంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.