పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. భద్రతే లేదు..

author img

By

Published : Nov 25, 2022, 9:18 AM IST

Updated : Nov 25, 2022, 10:39 AM IST

Health Department employees        When will the problems of contract workers be removed?

Condition of Contract Employees of Health Department: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం. చనిపోతే పట్టించుకునే దిక్కేలేదు. సర్కార్ కొలువంటూ రేషన్ కార్డ్ తీసేశారు. పథకాలు ఇవ్వడమూ ఆపేశారు. 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉన్నా.. గుర్తింపు లేదని పెదవి విరుస్తున్నారు. వెట్టిచాకిరీ చేయించుకున్నా ఉద్యోగ భద్రత లేదని ఆవేదన చెందుతున్నారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

Condition of Contract Employees of Health Department: రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నా వారింకా తాత్కాలిక ఉద్యోగులే. రిటైర్మెంట్ దగ్గరపడుతున్నా.. ఎప్పుడు పర్మినెంట్ చేస్తారా అని నిరీక్షణ. వైసీపీ ప్రభుత్వ హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని.. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఒక్క పైసా ఆర్థిక సహాయం అందలేదని మండిపడుతున్నారు. రేషన్ కార్డ్, ప్రభుత్వ పథకాలు నిలిపివేయడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ విజయవాడలో జరిగిన ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో గోడు వెళ్లబోసుకున్నారు.

వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఆవేదన

రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన జిల్లాలకు కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. హామీలు నెరవేర్చకుంటే ఉద్యమానికి సైతం వెనకాడబోమని ఉద్యోగ నేతలు తేల్చిచెబుతున్నారు. డిసెంబర్ 11న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సభకు సంబంధించిన గోడ ప్రతులు, కరపత్రాలు, జెండాను ఆవిష్కరించారు.

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులకు.. ఫేస్ రికగ్నైజ్ యాప్లోనే హాజరు వేయాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆచరణలో ఇది సాధ్యపడటం లేదని ఉద్యోగులు అంటున్నారు. అప్లికేషన్ల పేరుతో ఏన్​ఎం​ లపై మోయలేని భారం వేస్తూ.. ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. వేకెన్సీ పోస్ట్ భర్తీ అయినా తమను తాత్కాలిక ఉద్యోగిగానే ఉంచారని ఆవేదన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 25, 2022, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.