పసుపుసంద్రాన్ని తలపించిన జగ్గయ్యపేట, నందిగామ.. చంద్రబాబు రోడ్ షో కు భారీ స్పందన
Published: Nov 5, 2022, 7:12 AM


పసుపుసంద్రాన్ని తలపించిన జగ్గయ్యపేట, నందిగామ.. చంద్రబాబు రోడ్ షో కు భారీ స్పందన
Published: Nov 5, 2022, 7:12 AM
Chandra Babu Naidu: వైకాపా అవినీతితో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులుపడినా రోజూ.. అవినీతి సొమ్ము జగన్ ఇంటికి చేరాల్సిందేనని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. జగన్‌ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. బాదుడేబాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ షో నిర్వహించగా.. నందిగామలో దుండగులు రాళ్లు విసిరారు.
Chandra Babu Naidu: ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేటలో తెలుగుదేశం చేపట్టిన బాదుడేబాదుడు కార్యక్రమం జనసంద్రాన్ని తలపించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోకు తెలుగదేశం శ్రేణులు కదంతొక్కారు. చంద్రబాబు పర్యటన సాగిన జాతీయరహదారి పరిసరాలు కిక్కిరిశాయి. నందిగామలో రోడ్‌షోకు ప్రజలు నీరాజనం పలికారు. రాత్రి జగ్గయ్యపేటలో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో పన్నుల బాదుడుతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని, సహజ వనరులను వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడిందన్నబాబు.. అమరావతిని అథోగతిపాలు చేయడంతో మూడు లక్షల కోట్ల సంపద ఆవిరైందని ధ్వజమెత్తారు. యువత రోడ్డెక్కి ఉద్యమించాల్సిన సమయం అసన్నమైందని పిలుపినిచ్చారు. ఆద్యంతం కార్యకర్తల కదనోత్సాహం మధ్య సాగిన పర్యటనలో చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు లక్ష్యంగా దుండగులు రాళ్లదాడికి పాల్పడగా అది ప్రధాన భద్రతాధికారి మధుకు తగిలింది. ఆగంతకుడు పదునైన రాయి విసరడాన్ని గమనించిన.. భద్రత అధికారి రెప్పపాటులోనే చంద్రబాబుకు అడ్డుగా నిలిచాడు. అతని చేతికి గాయమైంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందిగామ, జగ్గయ్యపేటలో భారీగా ప్రజలు తరలిరావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. మహిళలు, యువత రోడ్డుకు ఇరువైపులా బారులుతీరి పూలవర్షం కురిపించారు. జగ్గయ్యపేటలో సభ ముగిసే సరికి అర్థరాత్రి దాటినా ప్రజలు ఓపిగ్గా ఎదురుచూశారు.
ఇవీ చదవండి:
