అదరగొడుతున్న బాలయ్య.. వీర లుక్​లో బ్రాండింగ్

author img

By

Published : Mar 9, 2023, 11:39 AM IST

balakrishna

Balakrishna and Pragya Jaiswal in Vijayawada: తెలుగువారు కొత్తగా ఏ రంగంలోకి అడుగుపెట్టినా ప్రొత్సహించేందుకు ముందుంటానని నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన వేగ జ్యుయలర్స్ షోరూంను.. కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌​తో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

విజయవాడలో సందడి చేసిన బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్

Balakrishna and Pragya Jaiswal Opened Jewellery Showroom: నట సింహం నందమూరి బాలకృష్ణ.. ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఓ వైపు సూపర్ హిట్ మూవీస్, మరోవైపు అన్​స్టాపబుల్ షోతో దూసుకుపోతున్నారు. అన్​స్టాపబుల్ సక్సెస్​తో ప్రస్తుతం బాలయ్యకి వివిధ యాడ్స్ క్యూ కడుతున్నాయి. తాజాగా వేగ జువెల్లరీ షోరూంకు బ్రాండింగ్ చేస్తూ.. దానిని విజయవాడలో ప్రారంభించారు. దీంతో బాలయ్యను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంగా సందడిగా మారింది. ఏ రంగంలో అడుగుపెట్టినా.. విజయం సాధించడం తన నైజం అని బాలకృష్ణ అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం మహిళలందరూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని అన్నారు. దేశ విదేశాలలో మహిళలు వివిధ హోదాల్లో ఉన్నారని, ఇతర దేశాల రాజకీయాలలో కూడా తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. ఇది తెలుగువారిగా, భారతీయులుగా ఎంతో గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు.

తెలుగు వారు ఏ రంగంలోనైనా కొత్తగా ఏం సాధించినా ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందుంటానని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ బృందావన కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వేగా జ్యుయలర్స్ షోరూమ్​ను బాలకృష్ణ, ప్రముఖ కథనాయిక ప్రగ్యా జైశ్వాల్‌ లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. తెలుగు వారి బంగారు అభరణాల మెడల్స్​ను వేగా జ్యుయలర్స్ ప్రజలకు మరోమారు పరిచయం చేయడంతో పాటు ప్రపంచానికి చూపుతుందని పేర్కొన్నారు.
ప్రముఖ కథనాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ప్రముఖ కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌ రాకతో విజయవాడ సందడిగా మారింది. అభిమానుల నినాదాలతో విజయవాడ మార్మోగింది. విజయవాడ బందరు రోడ్డు బృందావన కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వేగా జ్యుయలర్స్ షోరూంను వారు ప్రారంభించిన.. బాలయ్యను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో బందరు రోడ్డు కోలహలంగా మారింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ బంగారం కొనటం భావితరాలకు తరగని సంపదని అన్నారు. జ్యుయలర్స్ రంగంలో సుమారు రెండు దశాబ్దాల కాలంగా ఖాతాదారుల విశ్వాసం చూరగొన్న వేగా జ్యుయలర్స్ అన్ స్టాపబుల్ అన్నారు.

నగలు అంటే మహిళలకు మక్కువ ఎక్కువని, ఈ మహిళా దినోత్సవ కానుకగా మహిళల మనసును దోచే విభిన్న శైలితో, నిపుణులైన కళాకారులు తయారు చేసిన బంగారు అభరణాలు మహిళల కోసం అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. దేశ నలుమూలలు సంప్రదాయ సంస్కృతులను ప్రతిబింబించే విస్తృత శ్రేణి ఆభరణాలతో నేడు షోరూంను ప్రారంబించటం చాలా ఆనందంగా ఉందని కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌ తెలిపారు.

"ఏ రంగంలోనైనా మన తెలుగువారు ఏం కొత్తగా మొదలుపెట్టినా ప్రోత్సహించేందుకు నేను ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన సత్తా ఏమిటో దేశమంతా తెలియజేసేందుకు ఈ రోజు అడుగులేస్తున్నాం".- బాలకృష్ణ, ప్రముఖ నటుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.