ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఏపీఎన్జీవో ఫిర్యాదు.. గుర్తింపు రద్దు చేయాలన్న నేతలు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఏపీఎన్జీవో ఫిర్యాదు.. గుర్తింపు రద్దు చేయాలన్న నేతలు
APNGO complaint: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై సీఎస్ జవహర్ రెడ్డికి ఏపీఎన్జీవో సంఘం ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రోసా నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.
APNGO complaint: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణపై సీఎస్ జవహర్ రెడ్డికి ఏపీఎన్జీవో సంఘం ఫిర్యాదు చేసింది. లిఖిత పూర్వక ఫిర్యాదును ఆయనకు అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఏపీఎన్జీవో సంఘం ఫిర్యాదులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేయాలని కోరింది. రోసా నిబంధనలకు వ్యతిరేకంగా ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుమతి ఇచ్చారని ఫిర్యాదులో ఏపిఎన్జీఓ పేర్కొంది.
ఇవీ చదవండి:
