APGEA సీఎం జగన్ ఇచ్చిన హామీల సాధన కోసం.. మే 22 నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాచరణ

author img

By

Published : May 20, 2023, 4:47 PM IST

APGEA

APGEA General Secretary: రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల సమయం ఐతే ఆసన్నమైంది కానీ, పాదయాత్రలో ఇచ్చిన హామీలను మాత్రం జగన్ నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు మండిపడ్డారు. ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోగా... తాము దాచుకున్న సొమ్మునే ప్రభుత్వం వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఉద్యమ కార్యచరణకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని కోరారు.

Employee unions: రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నమైంది కానీ, పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కార్ రావు విమర్శించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా, వారు దాచుకున్న సొమ్మే ప్రభుత్వం వాడేసుకోడం ఏమిటని ప్రశ్నించారు. పీఆర్సీ సహా చాలా సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఆస్కార్ రావు వెల్లడించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్​ను తీసుకు వస్తానని చెప్పారని గుర్తు చేశారు. సీపీఎస్, ఓపీఎస్ కాకుండా ఇప్పుడు జీపీఎస్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

22 నుంచి కార్యాచరణ: హామీల అమలు కోసం దశల వారీ ఉద్యమానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు ఇచ్చిందని జి.ఆస్కార్ రావు అన్నారు. ఈ నెల 22 నుంచి కార్యాచరణ మొదలు అవుతుందని ఆస్కార్ రావు తెలిపారు. అన్నీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ఈ ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలని పిలుపు ఇచ్చామని ఆయన వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోపాటుగా... వివిధ శాఖల ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణలో పాలుపంచుకుంటారని ఆయన వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు బదిలీలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇక సమ్మెకు దిగడం మినహా తమకు మరో గత్యంతరం కనిపించడం లేదని అస్కార్ రావు అన్నారు. మే 22 నుంచి ప్రభుత్వ ఉద్యోగులంతా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు.

ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా...: గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను ప్రభుత్వం ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా వ్యవహరిస్తోందని గ్రామ, వార్డు సచివాలయం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత అబ్దుల్‌ రజాక్‌ అన్నారు. పీఆర్సీ తర్వాత సాధారణ ఉద్యోగి అందుకునే వేతనానికి గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు అందుకునే వేతనాల్లో తేడా ఉందని అన్నారు. ఇంటి అద్దె భత్యంలోనూ తేడాలు ఉన్నాయని తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగికి యూనిఫాం లేదని, కనీసం తమకు యూనిఫాం అలవెన్సులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ప్రొబేషన్ ఆలస్యం వల్ల ప్రతి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగి లక్షల రూపాయలు నష్టపోయారని తెలిపారు. పదోన్నతుల విషయంలోను వివక్ష చూపిస్తున్నారని అబ్దుల్ రజాక్ ఆరోపించారు.

పాదయాత్ర సమయం నుంచి జగన్ తాను అధికారంలోకి వస్తే ఇప్పుటి వరకు గత ప్రభుత్వాలు చేయని.. హామీలు అమలు చేస్తానని ప్రమాణాలు చేశారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాని చెప్పారు. అయితే సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం తరఫున 103 ఆర్థిక, ఆర్థికేతర డిమాడ్లను ప్రభుత్వం ముందు ఉంచినా, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మే 22 నుంచి మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యాం. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాలు పాల్గొనాలని కోరుకుంటున్నాం. జి.ఆస్కార్ రావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.