లారీలో మంటలు.. వాహనం దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్​

author img

By

Published : Jan 31, 2023, 7:19 PM IST

Lorry Caught Fire

Lorry Caught Fire : ఈ మధ్య కాలంలో వాహనాలు దగ్ధమయ్యే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. స్కూటీలు, బైకులు, కార్లు, లారీలు ఇలా వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. వాహనాల ప్రమాణాలు పెంచుతున్నా.. అగ్ని ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు.

Lorry Caught Fire : ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం జుజ్జూరు వెళ్లే దారిలో పొన్నవరం స్టేజ్ వద్ద లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మంటల కారణంగా లారీ డ్రైవర్‌ క్యాబిన్‌ పూర్తిగా దగ్ధమయ్యింది. డ్రైవర్ తృటిలో తప్పించుకున్నారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. భారీ కర్రల లోడ్​తో వెళుతున్న లారీ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం జుజ్జూరు వెళ్లే దారిలో అగ్ని ప్రమాదానికి గురైంది.

దగ్ధమౌతున్న లారీ

అకస్మాత్తుగా లారీలో నుంచి మంటలు చెలరేగడంతో డ్రైవర్ తృటిలో తప్పించుకున్నారు. మంటల కారణంగా లారీ డ్రైవర్‌ క్యాబిన్‌ పూర్తిగా దగ్ధమయ్యింది. స్ధానికుల సమాచారం మేరకు సకాలంలో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.