Minister Buggana: ఉపాధి హామీ డబ్బుల కోసం మంత్రి బుగ్గనకు మహిళల మొర
Updated on: May 11, 2022, 1:25 PM IST

Minister Buggana: ఉపాధి హామీ డబ్బుల కోసం మంత్రి బుగ్గనకు మహిళల మొర
Updated on: May 11, 2022, 1:25 PM IST
Minister Buggana: నంద్యాల జిల్లాలో ఆర్థికమంత్రి బుగ్గనకు సమస్యలు స్వాగతం పలికాయి. గడప గడప కార్యక్రమానికి వచ్చిన మంత్రిని మహిళలు అడ్డుకుని.. తమ మొర చెప్పుకున్నారు. రెండు నెలలుగా ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని.. ఇళ్లు మంజూరు చేయడంలేదని మంత్రి ముందు మహిళలు వాపోయారు. వారంలోగా సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చి.. అక్కడినుంచి వెళ్లిపోయారు.
Minister Buggana: గడప గడపకూ ప్రభుత్వం పేరిట జనంలోకి వెళుతున్న మంత్రులకు.. సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉగాది నుంచి ఉపాధి హామీ డబ్బులు రావట్లేదని నంద్యాల జిల్లాలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి మహిళలు మొర పెట్టుకున్నారు. బేతంచర్ల మండలం హెచ్.కొట్టాలలో మంత్రి బుగ్గన పర్యటించిన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ డబ్బులపై అధికారిని ప్రశ్నించిన మంత్రి బుగ్గన... వారంలో డబ్బులు వస్తాయని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:
- ఆత్మకూరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ప్రాణాలు కోల్పోయిన లెక్చరర్
- CBN TOUR: నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
- 'సెక్సీ సాంగ్కు నేను రెడీ'.. సమంత హాట్ కామెంట్స్
