చంద్రబాబుకు అనారోగ్యం.. అయినా ఆగని అరెస్టు... జగన్ సైకో పాలనపై నిరసనలు
చంద్రబాబుకు అనారోగ్యం.. అయినా ఆగని అరెస్టు... జగన్ సైకో పాలనపై నిరసనలు
chandra babu naidu arrested AND health condition: అరెస్టుకు ముందు చంద్రబాబకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు హైబీబపీ, షుగర్ ఉందని తేలింది. అయినా పోలీసులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా అరెస్టు కొనసాగించారు. చంద్రబాబునాయుడు అనారోగ్యంతో ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోవాలని ఆయన తరుపు న్యాయవాదులు పోలీసులకు తెలిపారు. అనార్యోగాన్ని సైతం పట్టించుకోకపోటంతో చంద్రబాబ తరుపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు. బాబుకు సంబంధం లేని కేసుతో, లేనిపోని సెక్షన్లు బనాయించి అరెస్టు చేయడాన్ని అటు తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోవటం లేదు.
అటు రాత్రంతా హైడ్రామా
chandra babu naidu arrested : అర్ధరాత్రి నుంచే చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పోలీసులు వ్యూహాత్మకంగా చేరుకున్నారు. రాత్రే అనంతపురం నుంచి బలగాలను నంద్యాలకు రప్పించారు. చంద్రబాబు బస చేసిన బస్సు చుట్టూ రోప్ పార్టీ ఏర్పాటుచేశారు. తమ చర్యలకు అడ్డంకులు లేకుండా చేసుకున్న పోలీసులు అడ్డుపెట్టిన తెలుగుదేశం వాహనాలను జేసీబీతో తొలగించారు. తెలుగుదేశం కార్యకర్తలు, మీడియా బృందాలను బయటకు పంపారు. చంద్రబాబు బస్సు వద్ద ఉన్న నాయకులను అదుపులోకి తీసుకొని...... పోలీసు వాహనాల్లో తరలించారు.కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి,ఎ.వి.సుబ్బారెడ్డి, బి.సి.జనార్దన్‌రెడ్డి, అఖిలప్రియ, ఇతర నేతలను అరెస్టు చేశారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో.. అనంతపురం DIG రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును కలవాలంటూ NSG సిబ్బందిని రఘురామిరెడ్డి కోరారు. ఈ సమయంలో కలవాల్సిన పనేంటని పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. మీకెందుకు చెప్పాలంటూ రఘురామిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. కేసుతో మీకేం సంబంధం అంటూ వాదించారు. అసలు కేసేంటో చెప్పాలంటూ తెలుగుదేశం నేతలు రఘురామిరెడ్డిని నిలదీశారు.
కేసు వివరాలపై నోరు మెదపని DIG రఘురామిరెడ్డి చంద్రబాబు బస చేసిన బస్సు తలుపుల వద్దకు దూసుకెళ్లారు. వారి తీరుపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. విషయమేంటో చెప్పకుండా ఎందుకు హడావుడి చేస్తున్నారని నిలదీశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రఘురామిరెడ్డి ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం ఇవ్వలేదు.
తెలుగుదేశం నాయకుల మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం : ఈ క్రమంలో డీఐజీ రఘురామిరెడ్డి, తెలుగుదేశం నాయకుల మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం సాగింది. తెల్లవారుజామున చంద్రబాబు కాన్వాయ్ కదులుతుందనే సమాచారం వచ్చిందని, అందుకే వచ్చామని..... రఘురామిరెడ్డి చెప్పారు. అసలు అలాంటిదేమీ లేదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేసినా DIG వెనక్కి తగ్గలేదు. మరోవైపు... ప్రోటోకాల్ ప్రకారం ఉదయం ఐదున్నరవరకూ VIPని కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని NSG సిబ్బంది తేల్చిచెప్పారు. ఉదయం ఐదున్నర తర్వాత.. వైద్య పరీక్షలు నిర్వహించి...... ఆ నివేదికను అధికారులకు పంపి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చంద్రబాబు వద్దకు పంపుతామని NSG కామాండెంట్ స్పష్టం చేశారు.
