గుర్రంలా కోడె దూడ విన్యాసాలు.. ఆశ్చర్యపోతున్న జనం

గుర్రంలా కోడె దూడ విన్యాసాలు.. ఆశ్చర్యపోతున్న జనం
Ox stunts: ఆ కోడె దూడ గుర్రంలా ఎగురుతోంది... చెట్లు, గట్ల పైనుంచి దూకుతోంది.. ఇది గమనించిన యజమాని దానికి మరింత శిక్షణ ఇచ్చాడు... బైక్‌లపై నుంచి దూకడం నేర్పించాడు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు బైక్లపైనుంచి ఒకేసారి దూకి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిని చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి జనాలు ఆ ఊరికి క్యూ కడుతున్నారు. ఆ విన్యాసాలు మీరూ చూసేయండి..
కర్నూలు జిల్లా మాధవరం గ్రామంలో ఉపేంద్ర అనే రైతు తన కోడె దూడతో బైక్ విన్యాసాలు చేయిస్తున్నారు. పొలంలో కోడె దూడ ఎగురుతుంటే చూసి మొదట తన ద్విచక్రవాహనం పైనుంచి దూకడం నేర్పించారు. ఒకటి కాదు.. ఇంకో 4 బైకులు వరుసగా పెడదామంటూ స్నేహితులు సూచించడంతో అదేవిధంగా చేశారు. ఏరువాక పౌర్ణమి రోజు ద్విచక్రవాహనాలను హైవే పక్కన వరుసగా నిలబెట్టి ప్రజలందరూ చూసేటప్పుడు కోడెదూడతో విన్యాసాలు చేయించారు. ఈ విన్యాసాలు చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి:
