YOUTH RASH DRIVING: రెచ్చిపోతున్న యువత..బైక్​పై ప్రమాదకర విన్యాసాలు

author img

By

Published : Sep 28, 2021, 12:52 PM IST

యువత ప్రమాదకర విన్యాసాలు

విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌పై యువకులు చెలరేగిపోతున్నారు. బైక్​ల​పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. బైక్​పై తుపాకీ చేతబట్టి హల్‌చల్ చేస్తున్నారు.

యువత ప్రమాదకర విన్యాసాలు

విజయవాడలో యువత రెచ్చిపోతోంది. అడ్డూఅదుపు లేకుండా రోడ్లపై బైక్​ విన్యాసాలు చేస్తున్నారు. తోటి వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

దుర్గగుడి ఫ్లైఓవర్‌పై కొందరు యువకులు.. బైక్​లపై భయపడే విధంగా విన్యాసాలు చేశారు. ద్విచక్ర వాహనంపై ప్రాణాంతక విన్యాసాలతో దూకుడుగా వ్యవహరించారు. బైక్​ను విచ్చలవిడగా నడపడమే కాకుండా.. మధ్యలో బైక్‌పై నిలబడి తుపాకీ చూపిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఎవరూ గుర్తించకుండా నెంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై విన్యాసాలు చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

పోలీసులు, నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా యువత మాత్రం ఇలాంటి చర్యలు మానుకోవడం లేదని పలువురంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ చదవండీ.. By Election Schedule: బద్వేలు, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.