ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఇదేనా..? కలెక్టర్లు, ఎస్పీలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్

author img

By

Published : Mar 13, 2023, 12:47 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Leader Chandrababu : ఎన్నికల్లో ప్రలోభాలు, అధికార పార్టీ అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామికంగా జరగాల్సిన ఎన్నికలు.. అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా.. పోలింగ్ లో అక్రమాలు, వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు.

కలెక్టర్లు, ఎస్పీలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్

TDP Leader Chandrababu : ఎన్నికలు ఇంత స్థాయిలో అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా.. పోలింగ్ లో అక్రమాలు, వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు. వివిధ ఘటనలపై కడప ఎస్పీ, తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలు అధికారులకు వివరించి తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు.

అధికార యంత్రాంగం మౌనం.. బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఓటువేయాల్సిన ఎన్నికల్లో అనర్హులు, నిరక్షరాస్యులతో బోగస్ ఓట్లు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పక్షాల ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్ గా తీసుకోవాలన్నారు. తిరుపతిలో బోగస్ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బాలినేని నిబంధనల ఉల్లంఘనలపై ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు ఫోన్ చేశారు. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసులు చర్యలు తీసుకోక పోవడంపై ఫిర్యాదు చేశారు. ఎస్పీకి వివరాలు తెలిపి చర్యలకు డిమాండ్ చేశారు. సమీక్ష సమావేశంలో టీడీపీ ముఖ్యనేతలు యనమల, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, టీడీ జనార్దన్ తదితర నేతలు పాల్గొన్నారు.

ప్రలోభాల పర్వాలు... పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నా.. ప్రలోభాల పర్వాలు కొనసాగుతున్నాయి. విశాఖలో నగదు పంచుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తను పీడీఎఫ్​ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

వాలంటీర్ అందించిన జాబితా మేరకు.. ఈశ్వరరావు అనే వ్యక్తి... పార్టీ కార్యాలయంలో లక్ష రూపాయలు తీసుకుని వాలంటీర్ అందించిన జాబితా ప్రకారం స్థానిక హెచ్​బీ కాలనీలో ఓటర్లకు డబ్బులు పంచాడు. తాము పట్టుకోవడానికి ముందే 17మందికి డబ్బు పంచినట్లు పీడీఎఫ్​ నేతలు చెప్పారు. ఈశ్వరరావు నుంచి మిగిలిన డబ్బులు స్వాధీనం చేసుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు.. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన 295, 296 పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ రంగులు వేసిన ఫర్నిచర్ ఉంచడం గమనార్హం. అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.