Chinnaoutpalli Accident: ముగ్గురి పైనుంచి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు దుర్మరణం

author img

By

Published : Dec 2, 2021, 7:44 PM IST

Updated : Dec 2, 2021, 9:39 PM IST

road accident at Chinnaoutpalli

19:39 December 02

కృష్ణా జిల్లా చిన్నఅవుటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

Chinnaoutpalli Accident: కృష్ణా జల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయిన వాళ్ల పైనుంచి ఓ లారీ వెళ్లిపోయిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు.

చిన్నఅవుటపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని.. ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైకుపై ఉన్న వాళ్లు రహదారిపై పడిపోయారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ లారీ.. రోడ్డుపై పడిపోయిన ముగ్గురి పైనుంచి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ పరిస్థితి విషమం ఉంది. స్థానికులు వెంటనే సమీప అస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి.. : VOLUNTEER SUICIDE IN SRIKALAHASTI: మహిళా వాలంటీర్ ఆత్మహత్య.. ఆ కానిస్టేబులే కారణమా..?

Last Updated :Dec 2, 2021, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.