మేమున్నామంటూ వచ్చారు.. పాడె మోసి.. దహన సంస్కారాలు నిర్వహించారు!

author img

By

Published : May 12, 2022, 8:50 PM IST

Updated : May 13, 2022, 11:07 AM IST

Anganwadi Workers

Anganwadi Workers: ఆమె ఒక అంగన్వాడీ కార్యకర్త.. అనారోగ్యం కారణంగా మృతి చెందింది. ఆమె ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. అయితే ఇంటి ఓనర్​ ఇంట్లో శవం ఉండటానికి వీలులేదని చెప్పడంతో చేసేదేమీ లేక శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కానీ దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు దహన సంస్కారాలు నిర్వహించి.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. ఈ హృదయ విదారకఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

Anganwadi Workers: కృష్ణాజిల్లా మచిలీపట్నం బుట్టాయిపేటలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఉల్లింగపాలెంలో అంగన్వాడీ టీచర్​గా పని చేసే సౌజన్య మృతి చెందింది. అయితే ఆమె అద్దె ఇంట్లో ఉంటుంది. ఆమె మరణవార్త తెలుసుకున్న ఇంటి ఓనర్​ మానవత్వం అనేది మరచి ఇంట్లో శవం ఉండకూడదని చెప్పడంతో చేసేదేమీ లేక శ్మశానానికి తీసుకెళ్లారు. అయితే అయినవాళ్లు ఎవరూ దహన సంస్కారులు చేసేందుకు ముందుకు రాలేదు. కట్టుకున్న భర్త ఉన్నా కడచూపునకు రాలేదు. విషయం తెలుసుకున్న తోటి అంగన్వాడీ కార్యకర్తలు పాడే మోసి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించారు.

ఇదీ జరిగింది...: ఉల్లింగపాలెంలో అంగన్వాడీ టీచర్​గా విధులు నిర్వహిస్తున్న సౌజన్య గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. కొద్దికాలం క్రితం భర్త వదిలేయటంతో తల్లి వద్ద ఉంటోంది. ఇటీవలే ఆమె తన కుమార్తెకు పెళ్లి చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సౌజన్య బుధవారం మరణించారు. అద్దె ఇంట్లో శవం ఉంచకూడదని..యజమాని చెప్పటంతో ఆమె మృతదేహాన్ని కృష్ణవేణి ఐటీఐ కాలేజీ సమీపంలోని...శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. దహన సంస్కారాలు చేసేందుకు ఎవరు రాకపోవటంతో విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలంతా కలిసి...శ్మశాన వాటిక వద్దకు వెళ్లి మృతురాలికి దహన సంస్కారాలను నిర్వహించారు.

ఇవీ చదవండి:

Last Updated :May 13, 2022, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.