కోనసీమ జిల్లాలో 1 కిలో మీటర్​ పొడవైన భోగి దండ ..

author img

By

Published : Jan 14, 2023, 4:59 PM IST

Women made Bhogi Danda for 1 km

Bhogi Danda: భోగి పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహిళలు అంతా కలిసి 6 టన్నుల ఆవు పేడను సేకరించి భారీ భోగి దండను తయారు చేశారు. సుమారు కిలో మీటర్​ పొడవైన ఈ భోగి దండ అందరినీ ఆకట్టుకుంది.

1 కి.మీ మేర భోగి దండ తయారు చేసిన మహిళలు

Bhogi Danda: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో స్థానిక మహిళలు తయారు చేసిన భోగి దండ అందరినీ ఆకట్టుకుంది. సుమారు కిలో మీటర్​ పొడవైన ఈ భోగి దండ తయారీకి మహిళలు ఎంతో శ్రమించారు. గ్రామానికి చెందిన మహిళలు అంతా కలిసి 6 టన్నుల ఆవు పేడను సేకరించి ఈ భోగి దండను తయారు చేశారు. భోగి పండుగ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి ఈ దండను ఊరేగించి అనంతరం భోగిమంటలో వేశారు. కోలాటం నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.