పోలీసుల తీరును నిరసిస్తూ.. ప్రభలను రోడ్డుపైనే నిలిపేసిన నిర్వాహకులు

author img

By

Published : Jan 16, 2023, 11:58 AM IST

Prabhala Theertham

Prabhala Theertham : కోనసీమ జిల్లాలో నిర్వహిస్తున్న సంబరాలను పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. అనుమతులు లేకుండా సంబరాలు నిర్వహిస్తున్నారని పోలీసులు అంటున్నారు. అసాంఘిక కార్యకాలపాలేవీ లేవని.. ప్రతియేటా నిర్వహించినట్లే నిర్వహిస్తున్నామని నిర్వహకులు అంటున్నారు. ఇంతకీ ప్రభల ఉత్సవాలలో ఏం జరిగిందంటే..

కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలను అడ్డుకున్న పోలీసులు

Police Stopped Prabhala Theertham : కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగ సంబరాలలో సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం నిర్వహిస్తున్న సంబరాలను నిర్వహకులు మధ్యలో నిలిపివేశారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం సంబరాలను నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని.. నిరసనగా ప్రభలను రోడ్డుపై నిలిపి నిరసన తెలిపారు. జిల్లాలోని కొత్తపేటలో సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బాజా భజంత్రీలను ఏర్పాటు చేసి చిన్నా పెద్ద చేరి సంబరాలు చేసుకుంటున్నారు. వీటిని పోలీసుల పలు కారణాలు చూపుతూ అడ్డుకున్నారు.

ప్రతి సంవత్సరం సంబరాలను నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం మేళా తాళాల నడుమ బాజా భజంత్రీలతో ఊరేగిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఊరేగింపు సమయంలో టపాసులు కాలుస్తూ కేరింతలు కొడుతూ యువకులు ఉత్సహంగా ఈ వేడుకలలో పాల్గొంటారు. అయితే ఈ సంవత్సరం నిర్వహించిన సంబరాలను పోలీసులు అడ్డుకున్నారు. సంక్రాంతి సంబరాలలో రికార్డింగ్​ డ్యాన్సులు నిర్వహిస్తున్నందుకు నిలిపివేశారు. రికార్డింగ్​ డ్యాన్సులకు అనుమతి లేని కారణంగానే నిలిపివేశామని పోలీసులు అంటున్నారు. దీంతో నిర్వహకులు ప్రభలను రోడ్డుపైనే నిలిపివేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రభలను అక్కడే నిలిపి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వహకులు మాత్రం పోలీసుల తీరును నిరసిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారమే ఈ సంవత్సరం సంబరాలను ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు అంటున్నారు. ప్రతియేటా నిర్వహించినట్లే ఈ సంవత్సరం వేడుకలను నిర్వహిస్తున్నామంటున్నారు. రికార్డింగ్​ డ్యాన్స్​లకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారని.. వీటిలో రికార్డింగ్​ డ్యాన్స్​లు ఉంటాయని నిర్వాహకులు వివరిస్తున్నారు. గతంలో పోలీసులు ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి నిచ్చేవారని.. అందులో డ్యాన్స్​లు, రికార్డింగ్​ డ్యాన్స్​లూ అశ్లీలత లేకుండా ఉంటాయని పేర్కొంటున్నారు. పోలీసులు రికార్డింగ్​ డ్యాన్సులకు అనుమతి ఇచ్చే వరకు ప్రభలను అక్కడి నుంచి తరలించేది లేదని అంటున్నారు. పోలీసుల అనుమతి ఇచ్చిన తర్వాతే ప్రభలను అక్కడి నుంచి తరలించి తీర్ధం నిర్వహిస్తామని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

"ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటాం. గతంలో సంస్కృతిక కార్యక్రమాలు, రికార్డింగ్​ డ్యాన్స్​లను ఏర్పాటు చేసే వాళ్లం. అందులో ఎటువంటి ఆశ్లీలత ఉండదు. పోలీసులు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం పోలీసులు దారుణంగా వ్యవహరించి అడ్డుకున్నారు. పోలీసులు రికార్డింగ్​ డ్యాన్సులకు అనుమతిని ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి ప్రభలను తీసుకెళ్లేది లేదు." - ఉత్సవ కమిటీ సభ్యులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.