లక్ష్యం పూర్తయితే .. మిగిలిన ధాన్యం పరిస్థితేంటి..?

author img

By

Published : Jan 20, 2023, 11:44 AM IST

Kharif Grain Crop

Rat-infested Grain Crop: రైతుల వద్ద ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయటం లేదు.. లక్ష్యాలు చేధించకుండానే రైతుల వద్ద ఉన్న పంటను కొనుగోలు చేయటం నిలిపివేశారు.. దీంతో రైతులు ప్రకృతి విపత్తుల నుంచి పండించిన పంటను కాపాడుకోలేకపోతున్నారు.. పంటంతా ఎమోతోందంటే..!

లక్ష్యం చేధిస్తే.. మిగిలిన ధాన్యం పరిస్థితేంటి..?

Rat-infested Grain Crop: రైతుల వద్ద ధాన్యం పూర్తయ్యే వరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం గుప్పించిన మాటలకు క్షేత్రస్థాయిలో పనులు జరగటం లేదు. ధాన్యం సేకరణ లక్ష్యాలు పూర్తయిందనే కారణంతో.. రైతుల వద్ద ఇంకా ధాన్యం ఉన్నా.. అధికారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. పంటను కొనుగోలు చేస్తారని రైతులు కళ్లాల్లో ఉంచిన ధాన్యం.. ఎలుకల బారినపడి రైతన్నలు మరింత నష్టపోతున్నారు.

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల వద్ద ఖరీఫ్ ధాన్యం ఇంకా ఉండిపోయాయి. ఈ జిల్లాలో 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇంత వరకు 2.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యం రైతుల వద్దనే బస్తాల్లో నింపి కళ్లాల్లో ఉంచారు. లక్ష్యం చేధించామనే నెపంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.. దీంతో కళ్లాల్లో ధాన్యం కాపాడుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు.

రోజుల తరబడి కళ్లాల్లో ధాన్యం బస్తాలను వదిలేయడంతో పంటంతా ఎలుకల భారిన పడుతోందని రైతులు వాపోతున్నారు.. ఎలుకలు బస్తాలను కొట్టేయడంతో పంటంతా నేలపాలు అవుతోంది.. మరోవైపు పంటంతా గుల్లబారిపోతోంది. దీని వల్ల రైతన్నలు మరింత నష్టపోతున్నారు. ఆర్బీకే, సొసైటీల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని రైతన్నలు వాపోతున్నారు. నష్టపోయిన పంటను, మిగిలి ఉన్న ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.