చొల్లంగిలో అమావాస్య పుణ్యస్నానాల రద్దీ

author img

By

Published : Jan 21, 2023, 4:21 PM IST

Amavasya holy baths

Amavasya holy baths: భారత్ సంప్రదాయాలకు పెట్టింది పేరు. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందుతున్నా.. వైద్య విధానంలో ఎన్నో మార్పులు వచ్చినా.. ప్రజల్లో కొన్ని నమ్మకాలు బలంగా నాటుకుపోయాయి. ముఖ్యంగా భారతీయులకు దైవ భక్తి ఎక్కువ. అందుకే ప్రజల్లో ఉండే నమ్మకాలు.. భక్తులకు ఉండే విశ్వాసాలు ఫలితాలు ఇస్తున్నాయని చెప్పాలి.. దీనికి నిదర్శనమే చొల్లంగి అమావాస్య స్నానాలు..

Amavasya holy baths: ప్రస్తుతం మన దేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. భారత్ అభివృద్ధిలో ముందుకెళుతున్నా ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నా.. ప్రజలలో ఉన్న నమ్మకాలు మాత్రం పోవు. ఎందుకంటే భారత సంస్కృతి ఎన్నో నమ్మకాలతో ఏర్పడింది. దేశంలోని ప్రజలు దైవంపై విశ్వాసంతో జీవిస్తున్నారు. ఇలా చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దీనిలో భాగంగానే కోనసీమ జిల్లాలో కొలువైన కాలభైరవ స్వామి భక్తుల కోరికలు తీర్చుతుండటంతో వారి నమ్మకం మరింత పెరుగుతుంది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బ్రహ్మసమేదం గ్రామంలో కొలువైన కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువుదీరిన స్వామి కోరిన కోరికలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతీ ఏడాది చొల్లంగి అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమావాస్య రోజున రాత్రి సంతానం లేని మహిళలు నిద్ర చేసి, అనంతరం తెల్లవారుజీమున సముద్ర స్నానం చేసి కాలభైరవ స్వామి దర్శించుకుంటే తప్పక పిల్లలు పుడతారు అనేది అనాదిగా ప్రచారంలో ఉంది.

ఈ ఆలయానికి సమీప గ్రామ ప్రజలతోపాటు రాష్ట్రంలో అనేకమంది సంతానం లేనివారు వచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సర్కిల్ ఇన్స్​పెక్టర్ జానకిరామ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.