కాకినాడ హైవే పై లారీ, కంటైనర్ ఢీకొని.. ఇద్దరు డ్రైవర్లు సహా క్లీనర్ సజీవదహనం
Updated on: Dec 2, 2022, 8:40 AM IST

కాకినాడ హైవే పై లారీ, కంటైనర్ ఢీకొని.. ఇద్దరు డ్రైవర్లు సహా క్లీనర్ సజీవదహనం
Updated on: Dec 2, 2022, 8:40 AM IST
Road Accident in Prathipadu: ధర్మవరం జాతీయ రహదారిపై అర్థరాత్రి లారీ, కంటైనర్ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తో సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.
Road Accident in Prathipadu: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం జాతీయ రహదారిపై అర్థరాత్రి లారీ, కంటైనర్ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తో సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు. కత్తిపూడి వైపుగా ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి డివైడర్ మీదగా ఆవలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను అతి వేగంగా డీ కొనడంతో.. మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తువల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి:
