నాగార్జున వర్సిటీలో.. విజయవంతంగా ముగిసిన ఉద్యోగ మేళా

author img

By

Published : May 8, 2022, 8:55 PM IST

విజయవంతంగా ముగిసిన ఉద్యోగ మేళా

వైకాపా ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రెండ్రోజుల జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎంపీ విజయసాయిరెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు.

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రెండ్రోజుల జాబ్ మేళా ముగిసింది. రెండో రోజు ఇంటర్వ్యూలకు 14,500 మంది హాజరు కాగా.., వారిలో 3,700 మంది ఎంపికయ్యారు. రెండు రోజుల్లో మొత్తం 10,480 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రెండో రోజు దాదాపు మరో 2 వేల మందిని రెండో రౌండ్‌ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖపట్నం, తిరుపతిలో జాబ్ మేళాలతో కలిపి 40,243 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. వచ్చే నెలలో కడపలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎంపీ విజయసాయిరెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు.

తొలి రోజు లోమా ఐటీ సంస్థ అత్యధికంగా 11 లక్షల వార్షిక ప్యాకేజీతో ప్లేస్​మెంట్ ఇచ్చింది. సీఎఫ్‌ఎల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్ క్లస్టర్‌ మేనేజర్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థికి రూ.5 లక్షల 47 వేల ప్యాకేజీ ఇచ్చారు. మొదటి రోజు 142 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 7,473 మందికి ఉద్యోగాలు లభించాయి. 1,562 మందిని షార్ట్‌లిస్ట్‌ చేయగా.. వీరికి ఇవాళ రెండో రౌండ్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.