'జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్​ను కలిశారంటే.. ప్రభుత్వం సిగ్గుపడాలి'

author img

By

Published : Jan 20, 2023, 5:29 PM IST

AP Employees Union Leaders

AP Employees Union Leaders: జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ వద్దకు వెళ్లాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని తెలుగుదేశం మండిపడింది. దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రాలేదని టీడీపీ నేత అశోక్‌బాబు అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని.. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

TDP Leaders Reaction on AP Employees Union: ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వని ప్రభుత్వం సలహాదారులకు మాత్రం లక్షల్లో జీతాలు చెల్లిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుల్లో అధిక శాతం మంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గమేనని తెలిపారు. బీసీ, ఎస్సీలపై జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ ఏపాటిదో సలహాదారుల జాబితా చూస్తే తేలిపోతుందని ఎద్దేవా చేసారు. పరిశ్రమల శాఖలో ఆరుగురు సలహాదారులు ఉంటే, సీఎం పెట్టుబడుల కోసం దావోస్ కూడా వెళ్లలేదని ఆక్షేపించారు. సలహాదారులకు వందల కోట్లు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం ప్రగతి సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్: జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ వద్దకు వెళ్లాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులకు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి.. ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి అప్పులు పుడితే తప్ప.. ఉద్యోగులకు జీతాలు అందడం లేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి కేంద్రం తక్షణమే రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాలని విజ్ఞప్తి చేశారు. జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్​ని కలవడం దేశంలో ఇదే తొలిసారన్నారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు

ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై గవర్నర్​ను కలవడం ఇంతవరకు చూడలేదు. జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్​ను కలవడం.. రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులకు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి.. ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోంది. రాష్ట్ర ఆదాయం రూపాయి ఉంటే.. అప్పు రెండు రూపాయలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి అప్పులు పుడితే తప్ప.. ఉద్యోగులకు జీతాలు అందడంలేదు. అందుకే ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి కేంద్రం తక్షణమే రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాలి.. జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్​ని కలవడం దేశంలో ఇదే తొలిసారి. -అశోక్ బాబు, ఎమ్మెల్సీ

ప్రత్తిపాటి పుల్లారావు: ఉద్యోగుల జీతాల కోసం గవర్నర్‌ను కలవడం దురదృష్టకరమని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటనతో జగన్‌ ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయిందంటూ ప్రత్తిపాటి విమర్శించారు. ఉద్యోగులు ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయారంటే జగన్‌ సిగ్గుపడాలంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్‌ పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.