State govt abandoned Amaravati: అమరావతిపై ఎందుకంత అక్కసు.. అవకాశం వచ్చినా మీ ప్రభుత్వానికి కనబడదా..!

author img

By

Published : May 26, 2023, 7:46 AM IST

అమరావతిపై ఎందుకంత అక్కసు.. అవకాశం వచ్చినా మీ ప్రభుత్వానికి కనబడదా..!

State govt has abandoned Amaravati: అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం ఊరంతా తిరిగినట్లుంది..కొత్త నగరాల నిర్మాణం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు. మహానగరానికి కావాల్సిన సకల వనరులున్న అమరావతిని వదిలేసి.. సీఎం సొంత జిల్లాలోని కొప్పర్తి ప్రతిపాదించింది. కంటికి కనిపిస్తున్న పండను కాదని పిందె కోసం ప్రభుత్వం అర్రులు చాస్తోంది.

అమరావతిపై ఎందుకంత అక్కసు.. అవకాశం వచ్చినా మీ ప్రభుత్వానికి కనబడదా..!

State govt has abandoned Amaravati: 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు దేశంలో కొత్తగా 8 నగరాల్ని అభివృద్ధి చేయాలని.. కేంద్రం నిర్ణయించింది. ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకు సరైన ఎంపిక అమరావతి అని విజ్ఞత ఉన్న ఎవరైనా చెప్పేస్తారు. భూ సమీకరణ, సిద్ధమైన ప్రణాళిక, ఇప్పటికే రోడ్లు వంటి ప్రధాన వసతుల అభివృద్ధిలో ముందుకెళ్లిన ప్రాంతం కావడమే ఇందుకు కారణం. కానీ, జగన్‌ ప్రభుత్వం అమరావతిని వదిలేసి వైఎస్సార్​ జిల్లాలోని కొప్పర్తిని ప్రతిపాదించింది. వైసీపీ ప్రభుత్వం అమరావతిపై ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనం. 15వ ఆర్థిక సంఘం ఏ లక్ష్యంతో కొత్త నగరాల్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందో.. దానికి అమరావతి సరిగ్గా సరిపోతుంది. కొత్త నగరాల నిర్మాణం తలపెట్టినప్పుడు.. ఎలాంటి సవాళ్లు, అవరోధాలు ఎదురయ్యే అవకాశముందని ఆర్థిక సంఘం అభిప్రాయపడిందో.. వాటన్నిటినీ అమరావతి ఇప్పటికే అధిగమించేసింది.

వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. కేంద్రం నిర్మించాలనుకున్న ఒక్కోనగరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్థికసంఘం ప్రతిపాదించింది. ఆ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా 250 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు నిధుల కొరతే అమరావతిని నిలిపివేయడానికి కారణమైతే.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతోనైనా అభివృద్ధి చేయొచ్చు. అయినా అమరావతిని ఎంపిక చేయలేదు. దేశంలోని పట్టణ ప్రాంతాలు రద్దీగా మారిపోయాయని.. ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్నాయని, మౌలిక వసతుల అభివృద్ధి కష్టమవుతోందని ఆర్థిక సంఘం అభిప్రాయపడింది. పట్టణాల్లో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎంత సమస్యాత్మకమో.. కొవిడ్‌ విజృంభించినప్పుడుచూశామని.. అందుకే మరిన్ని కొత్త నగరాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. ఆర్థిక సంఘం సూచించింది.

పూర్తిగా కొత్తగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ నగరాల్లో రోడ్ల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పారుదల వంటి వ్యవస్థలకు పైపులైన్‌లు వేయడం, విద్యా సంస్థలు, పార్కులు వంటి వాటికి స్థలాలు కేటాయించడం తేలిక అని తెలిపింది. వీటిని పరిశీలిస్తే విభజన తర్వాత మహానగరం అంటూ లేని ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నగరాల ఆవశ్యకత తెలుస్తుంది. భవిష్యత్తులో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఎదిగేందుకు అవసరమైన వనరులు, ప్రణాళిక, సాధన సంపత్తి ఉన్న నగర నిర్మాణం అవససరం. అమరావతికి అలాంటి ప్రణాళిక, వనరులు పుష్కలంగా ఉన్నా.. ఉద్దేశపూర్వకంగా అమరావతి విధ్వంసానికి పూనుకొన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది.

గత ప్రభుత్వంలో 10 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు.. కొత్త నగర నిర్మాణానికి ప్రధాన సమస్య భూసేకరణ. అమరావతికి ఆ సమస్యలేదు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలకుపైగా భూమి ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనే బ్యాంకులు 2వేల 600 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాయి. ప్రపంచ బ్యాంకు నుంచి 3వేల 500కోట్ల రూపాయలు రుణం పొందేందుకు.. అప్పట్లోనే అంతా సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే రుణం ఇచ్చేందుకు అనేక సంస్థలు, బ్యాంకులు ముందుకొచ్చేవి. గత ప్రభుత్వ హయాంలోనే అమరావతిలో 10 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు వెచ్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం చేపట్టారు. స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా అమరావతిని రూపొందించారు. జాతీయ రహదారికి పక్కనే అమరావతి ఉంది. రైలు, ఎయిర్‌ కనెక్టివిటీ ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్న అమరావతిని పక్కన పెట్టి.. కొత్త నగర నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం మరో ప్రాంతాన్ని ప్రతిపాదించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.అమరావతిని కాదని.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.