పొరుగుసేవల ఉద్యోగుల కష్టాలన్నీ తీరుస్తామన్నారు..! ఠంచనుగా జీతాలన్నారు..! ఏక్కడ సారు..!

author img

By

Published : Dec 3, 2022, 1:12 PM IST

OUT SOURCING EMPLOYEES

OUT SOURCING EMPLOYEES: పొరుగుసేవల ఉద్యోగుల కష్టాలన్నీ తీర్చేస్తామంటూ పాదయాత్ర సమయంలో జగన్‌ ఊదరగొట్టారు. అధికారం చేపట్టాక ప్రైవేటు ఔట్ సోర్సింగ్ సంస్థలు, ఏజెన్సీలు తీసేస్తున్నామని చెప్పి..ఇకపై లంచాలు, కమిషన్లు ఊసే ఉండదన్నారు. దీంతో జీతాలు పెరుగుతాయి.. మంచి రోజులు వస్తాయని పొరుగుసేవల సిబ్బంది ఆనందపడ్డారు. మూడున్నర ఏళ్లు గడిచాయి. సీఎం చెప్పిన మాట ఇప్పటికీ వారి చెవులకు వినిపిస్తూనే ఉంది. కానీ ఆయన మాత్రం మరిచారు. ఫలితంగా పొరుగుసేవల సిబ్బంది కాంట్రాక్టర్ కిందే చాలీచాలని జీతాలతో .. కుటుంబ పోషణ కష్టమై నేటికీ కష్టాలు పడుతున్నారు. ఆప్కాస్​లో కలిపి తమ కష్టాలు తీర్చాలని పాలకులకు ఎన్నిసార్లు వేడుకున్నా అరణ్యరోదనే అవుతోంది.

OUT SOURCING EMPLOYEES PROBLEMS : ముఖ్యమంత్రి హోదాలో ఆప్కాస్ ను ప్రారంభిస్తూ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని ఆప్కాస్​లో చేర్చి మెరుగైన వేతానాలు ఇస్తామని ఘనంగా ప్రకటించారు. అన్ని డిపార్టుమెంట్లలో కాంట్రాక్టర్ కింద పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆప్కాస్​లో చేర్చుతామన్న సీఎం.. ఆహామీ పూర్తిగా నెరవేర్చలేదు. ఇంకా లక్షమంది పైగా ఔట్​సోర్సింగ్ సిబ్బంది.. కాంట్రాక్టర్ల కింద ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. వారందరినీ ఆప్కాస్​లో చేర్చాలని ఎన్నో సార్లు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కాంట్రాక్టర్ల కింద గొడ్డు చాకిరీ చేస్తూ వారి ఇచ్చినంత తీసుకుని దుర్భరంగా జీవితాలను గడుపుతున్నారు.

విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో రోజూ వేలాది మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు , పలు వార్డుల్లో నిర్వహణ, సెక్యూరిటీ గార్డులుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా సిబ్బందిని నియమించారు. ఎన్నో ఏళ్ల క్రితం నియమితులైన వీరికి ఇచ్చే జీతం పదకొండువేల లోపే. చాలా మందికి కాంట్రాక్టర్ ఇచ్చే జీతం 8 వేలే. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. మూడు నెలలకో ఆరు నెలలకో ఓ సారి ఇస్తారు. కుటుంబపోషణ భారంగా మారిందని ఔట్ సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప రిమ్స్ ఆస్పత్రిలోనూ ఇదే దుస్ధితి. నెలకు 8 నుంచి 9 వేల లోపే వేతనం తీసుకుంటున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, పలు కార్యాలయాల్లోనూ ఇప్పటికీ కాంట్రాక్టర్ ద్వారా నియమితులలైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేలల్లో ఉన్నారు. వీరంతా తమను ఆప్కాస్ లో చేర్చాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు.

ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేసి, పే స్కేల్ పెంచుతామని ఇచ్చిన హామీ ఎక్కడ సార్ అంటూ వీరంతా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖలు, సంస్థల్లో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందిని ఆప్కాస్ పరిధిలోకి మార్చాలని ప్రతిపాదనలు పంపారు. అవన్నీ అమలుకు నోచుకోలేదు.

కోటలు దాటిన సీఎం హామీలు.. నెలనెల రాని వేతనాలు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.