ఎన్టీఆర్ మనవడిగా.. ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా యువగళం : నారా లోకేశ్

ఎన్టీఆర్ మనవడిగా.. ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా యువగళం : నారా లోకేశ్
ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన మనవడిగా ప్రజల ముందుకు వెళ్తున్నట్లు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. సైకో సీఎంని ఇంటికి సాగనంపేందుకు కలసికట్టుగా పని చేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళగిరి మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు లోకేశ్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు.
ఎన్టీఆర్ మనవడిగా, ఆయన ఆశయ సాధన కోసం ప్రజల ముందుకు వస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆరాచక పాలన చేస్తున్న సైకో సీఎం ను ఇంటికి సాగనంపుదామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది లేని పాలనలో ప్రజా సమస్యలు తెలుసుకుని వారితో కలిసి నడిచే అవకాశం లభించటం ఓ కీలక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఎన్టీఆర్ అంత మంచి పేరు తెచ్చుకుంటానో లేదో కానీ తాత పేరు మాత్రం చెడకొట్టనని లోకేష్ వెల్లడించారు. యువగళం పేరుతో జనవరి 27 నుంచి ప్రారంభం కానున్న తన పాదయాత్ర గురించి కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. కాండ్రు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. గత కొంతకాలంగా వైసీపీ కు దూరంగా వుంటున్నారు. కాండ్రు చేరిక సందర్భంగా మంగళగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాండ్రు శ్రీనివాసరావుతో పాటు పెద్ద ఎత్తున మంగళగిరి వైసీపీ కార్యకర్తలు లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. దేశానికి అభివృద్ధి, సంక్షేమాన్ని పరిచయం చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని, అబద్ధానికి ఫ్యాటు, షర్టు వేస్తే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడని లోకేశ్ విమర్శించారు. పదేళ్లు జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడిన వైసీపీ కార్యకర్తలకు ... సీఎం అయ్యాక జగన్ ఏం చేశాడని ఆయ న ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తల సంక్షేమానికి అనునిత్యం పాటుపడే పార్టీ తెలుగుదేశమన్నారు. తమకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో వైసీపీ కార్యకర్తలు ఆలోచన చేయాలన్నారు. అన్ని ధరలు పెంచుతూ.. సామాన్యులని చిదిమేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేసారు.
రాష్ట్రంలో ఇతర ఏ నియోజకవర్గంలో లేని విధంగా 13 సంక్షేమ పథకాలు మంగళగిరిలో సొంతంగా అమలు చేస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. అధికారంలో లేకపోయినా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నానని, అధికారంలోకి వస్తే మంగళగిరి ఎలా ఉంటుందో ఆలోచన చేయాలంటూ..కార్యకర్తలను ఆయన కోరారు. అధికారంలోకి రాగానే మంగళగిరిలో 10వేల ఇళ్లు కట్టించే బాధ్యత తనపై ఉందన్నారు. ఇంటిపట్టాలేని వారికి గెలిచిన 3నెలల్లోనే బట్టలు పెట్టి మరీ పట్టాలు ఇస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ దాకా వెళ్ళిందని, మంగళగిరి కరకట్ట కమల్ హాసన్‌గా పేరొందిన ఆర్కే నటన ఆస్కార్ దాకా వెళ్తే.. ఆయనకు ఖచ్చితంగా అవార్డు వచ్చేదని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి:
