'ధాన్యం రేటు అడిగితే.. ఎవరైనా చెప్పుతో కొడతారా?'.. వారివి అసత్య ఆరోపణలు: ఎమ్మెల్యే

author img

By

Published : Jan 9, 2022, 9:12 PM IST

'ఎవరైనా ధాన్యం రేటు అడిగితే చెప్పుతో కొడతారా?'

MLA Bolla Brahma Naidu: ధాన్యం కోనుగోలు చేయమని అడిగిన రైతును.. అక్రమంగా అరెస్టు చేయించారంటూ తెదేపా నేేతలు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బహ్మనాయుడు అన్నారు. రైతు నరేంద్ర అరెస్టును రాజకీయ స్వార్థం కోసం వాడుతున్నారని మండిపడ్డారు. ఎవరైనా ధాన్యం రేటు అడిగితే చెప్పుతో కొడతారా? అని ప్రశ్నించారు.

MLA Bolla Brahma Naidu: ధాన్యం కోనుగోలు చేయాలని అడిగిన రైతును అక్రమంగా అరెస్టు చేయించారంటూ తెదేపా నేత జీవీ ఆంజనేయులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఎవరైనా ధాన్యం రేటు అడిగితే చెప్పుతో కొడతారా? అని ప్రశ్నించారు. ఇవన్నీ తెదేపా నేతలు కావాలని చేస్తున్న అసత్య ఆరోపణలు అన్నారు.

రైతు నరేంద్ర ఉద్దేశపూర్వకంగా ప్రథకం ప్రకారం తనతో వాదనకు దిగాడన్నారు. అంతే కాకుండా తన పీఏపై పదునైన ఆయుదంతో దాడికి యత్నించాడని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రైతు నరేంద్రపై కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనను తెదేపా నేత జీవీ ఆంజనేయులు రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారని ఆక్షేపించారు. పేదలకు అండగా నిలిచి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే.. అది ఓర్వలేక జీవీ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఏం జరిగిందంటే..?
వడ్లు కొనాలని అడిగినందుకు తమ అన్నపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హత్యాయత్నం కేసు నమోదు చేయించారని రైతు నరేంద్ర సోదరుడు చంద్రబాబు ఆరోపించాడు.

"గురువారం గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామానికి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును.. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించాలని.. ఇతర రైతులతో కలిసి మా అన్న నరేంద్ర కోరారు. కొనుగోలు అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని ఎంపీ చెప్పారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కసారిగా ఆగ్రహంతో మా అన్నను ఉద్దేశించి దూషణకు దిగారు. ఇదేమిటని ప్రశ్నించిన మా అన్నను.. భద్రతా సిబ్బందితో పక్కకు తోసేశారు. తర్వాత వినుకొండ పోలీసులు స్టేషన్‌కి తరలించారు. రెండ్రోజుల పాటు వినుకొండ, శావల్యాపురం ఠాణాలకు తిప్పి.. శనివారం ఉదయం కోర్టుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే పీఏతోపాటు అంజి అనే మరో వ్యక్తితో.. హత్యాయత్నం కేసు పెట్టించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది." అని బాధితుడి సోదరుడు చంద్రబాబు ఆరోపించాడు.

తెదేపా శ్రేణుల నిరసన..
ఈ ఘటనపై ప్రతిపక్ష తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు అరెస్టును నిరసిస్తూ.. వినుకొండ జైలు వద్ద తెదేపా శ్రేణుల నిరసన చేపట్టాయి. నరేంద్రపై కేసు ఎత్తివేయాలని తెదేపా నేతలు జీవీ ఆంజనేయులు, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల అసహనం పెరిగిందని.. ధాన్యం కొనాలన్న రైతును చెప్పుతో కొడతాననడం దేనికి నిదర్శనమని నేతలు ప్రశ్నించారు. రైతుపై హత్యాయత్నం కేసు నమోదు చేయించటం దారుణమన్నారు.

ఇదీ చదవండి

'మా అన్నపై కేసు పెట్టించారు.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ప్రాణహాని ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.