విశాఖ, తిరుపతి జూలు అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేయండి: పెద్దిరెడ్డి

విశాఖ, తిరుపతి జూలు అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేయండి: పెద్దిరెడ్డి
MINISTER PEDDIREDDY REVIEW ON ZOO : రాష్ట్రంలోని జూపార్క్‌లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన అరణ్య భవన్‌లో.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. జంతు ప్రదర్శనశాల్లో కొత్త జంతువులను మార్పిడి పద్ధతిలో భాగంగా సమకూర్చుకోవాలన్నారు.
MINISTER PEDDIREDDY REVIEW ON ZOO : రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి జూపార్క్‌లను మరింత అభివృద్ధి చేసేందుకు వెంటనే డీపీఆర్‌లను సిద్దం చేయాలని అధికారులను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన అరణ్య భవన్‌లో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని జూపార్క్‌లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
తిరుపతి, విశాఖ జూలకు ప్రభుత్వం ప్రత్యేకంగా డైరెక్టర్లను నియమిస్తోందని, వారి ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూ పార్క్‌ల్లో కొత్త జంతువులను ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా సమకూర్చుకోవాలన్నారు. దేశంలోని ఇతర జూలను సందర్శించి, అక్కడ అమలు చేస్తున్న మెరుగైన విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు.
జంతు ప్రదర్శనశాలల అభివృద్దికి సంబంధించి డీపీఆర్‌లను తయారు చేసుకుని, సెంట్రల్ జూ అథారిటీ నుంచి అవసరమైన అనుమతులను తీసుకోవాలన్నారు. సంరక్షణలో ఉన్న జంతువులకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలని, దీనిని పర్యవేక్షించేందుకు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు. అదే క్రమంలో జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.
జూ పార్క్‌లకు సందర్శకుల నుంచి వచ్చే ఆదాయానికి అదనంగా ఆర్థిక వనరులను సమీకరించుకునేందుకు సీఎస్ఆర్ నిధులను తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికే జంతువులను దత్తత తీసుకునే విధానం అమలులో ఉందని.. విశాఖ, తిరుపతి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు, కంపెనీలను ఇందుకు ప్రోత్సహించాలని అన్నారు.
ఇవీ చదవండి:
