'జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది'
Published: Mar 15, 2023, 7:50 PM


'జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది'
Published: Mar 15, 2023, 7:50 PM
Janasena Party PAC Chairman Manohar thanks giving: రాష్ట్ర ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని.. జనసేన ఆవిర్భావ సభతో అది రుజువైందని.. ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ మనోహర్ అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ విజయవంతం కావటంతో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభ విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Janasena Party PAC Chairman Manohar thanks giving: ''కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం నాడు నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ చరిత్రను సృష్టించింది. రాష్ట్రంలో రాజకీయాలు ఉన్నంతవరకూ ఈ సభ చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. జనసేన 10వ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన ప్రతి జనసేన కార్యకర్తకి, ప్రతి వీర మహిళకి, ప్రతి అధికారికి పార్టీ తరుపున, అధినేత పవన్ కల్యాణ్ తరుపున పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాము'' అని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం అయిన సందర్భంగా ఆయన పార్టీ ముఖ్య నేతలతో.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సభకు సహకరించిన ప్రతి రైతుకు, పోలీసు అధికారులకు, పార్టీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఈ సభ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఇంతటి ఆవిర్భావ సభను విజయవంతం చేయడంలో రాత్రి, పగలు కష్టపడిన పార్టీ నాయకులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని..ఇది క్షేత్రస్థాయి నుంచే బలంగా ఉందని నిన్నటి సభ ద్వారా తెలిసిందన్నారు.
జనసేన ఆవిర్భావ సభకు అశేష జనవాహిని తరలివచ్చారు. సభ విజయవంతం అయ్యింది. సభ కోసం కష్టపడిన నాయకులతో ఈరోజు ఆత్మీయ భేటీ నిర్వహించాం.రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. చాలా ప్రశ్నలకు పవన్ తన ప్రసంగంతో సమాధానమిచ్చారు. చాలా మంది మహిళలు వచ్చారంటే రాష్ట్రంలో మార్పు మొదలైంది. జనసేన నిస్వార్ధ రాజకీయాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. స్పందన స్ఫూర్తిని జన సైనికులు జనాల్లోకి తీసుకెళ్లాలి. -నాదెండ్ల మనోహర్, జనసేన పీఎసీ ఛైర్మన్
అనంతరం రాబోయే రోజుల్లో జనసేన కార్యక్రమాలను, సభలను ఏ విధంగా నిర్వహించాలి?.. ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి..? అనే విషయాలు తమకు స్పష్టంగా అర్ధమయ్యాయని.. నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సభలో అధినేత పవన్ కల్యాణ్‌పై తీసిన డాక్యుమెంటరీని ప్రదర్శించిన తీరు, వారాహి వాహన కోసం రూపొందించిన గీతం..సభకు విచ్చేసిన కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సహాన్ని నింపాయన్నారు.
మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందన్నారు. తన ధైర్యాన్ని ఓ కవచంగా పెట్టి, తొమ్మిదేండ్లక్రితం జనసేన పార్టీని పెట్టానన్నారు. అది ఈరోజు అనేక సవాళ్లను ఎదుర్కొని కార్యకర్తల రూపంలో ముందుకు సాగుతుందన్నారు.
"నా ఒక్కడితో ప్రారంభమైన ఈ జనసేన పార్టీ.. ఈరోజు దాదాపు 6,56,000 క్రియాశీలక సభ్యులుగా ఎదిగింది. పదేళ్ల ఈ ప్రస్థానంలో అనేక మాటలు పడ్డాము, ప్రజల మన్ననసు పొందాము, ఓటములను కూడా ఎదుర్కొన్నాను. కానీ, ఓరిమితో బరిలో ఉన్నాము. మరో రెండు చోట్ల పరాజయం పాలైనా కూడా.. వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు నా వెంట ఉన్నారన్న ధైర్యం నాలో మరింత ఉత్సహాన్ని కల్గించింది. రాజకీయాల్లో గెలుస్తున్న కొద్దీ బలపడతారు.. కానీ, జనసేన పార్టీ దెబ్బపడిన ప్రతిసారి బలపడుతోంది. జనసైనికులు పార్టీకీ అండగా నిలబడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల అండతో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
