ETV Bharat / state

రాత్రిళ్లు ఒకేచోట ఆహారం.. గుంటూరులో ఫుడ్‌కోర్టులు ప్రారంభం - FOOD COURTS nights in guntur latest news

గుంటూరు నగరంలో నూతనంగా ఫుడ్‌కోర్టుల ఏర్పాటు చేశారు. రాత్రి పూట అల్పాహారం దొరికేలా పోలీసుల వినూత్న చర్యలు చేపట్టారు. వ్యాపారులతో చర్చించి ఒకేచోట ఫుడ్‌కోర్టులు పెట్టించారు. వీటి పనితీరు బాగుంటే మరోచోట పెట్టడాన్ని పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఫుడ్‌కోర్టుల తీరుపై నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

food-courts-in-guntur
author img

By

Published : November 20, 2019 at 10:47 AM IST

Updated : November 20, 2019 at 12:41 PM IST

గుంటూరులో ఒకేచోట ఫుడ్‌కోర్టలు ప్రారంభం

గుంటూరులో రాత్రి 11 గంటలు దాటిందంటే ఆహార పదార్థాలు దొరకక అవస్థలు పడుతున్న నగరవాసులకు... కాస్త ఊరట లభించేలా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. రాత్రి ఒంటి గంట దాటినా భోజనం లభించేలా ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేయించారు. గతంలో చిరు వ్యాపారులు చిన్న బండ్లు, స్కూటీలపైన అల్పాహారాన్ని రోడ్డు ప్రక్కన విక్రయించేవారు. దీనివల్ల ట్రాఫిక్‌కు కలుగుతోందని భావించిన ఎస్పీ... వ్యాపారులందరితో చర్చించి ఒకేచోట ఫుడ్ కోర్టులను ప్రారంభించారు. వీటి పని తీరు బాగుంటే మరోచోట ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రెండురోజుల క్రితం హిందూ కళాశాల కూడలి వద్ద ప్రారంభమైన ఫుడ్‌కోర్టులకు స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఇవి కూడా చదవండి:

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేలో మార్పు!

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్..... గుంటూరు లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులను పట్టణ ఎస్పీ రామకృష్ణ పరిశీలించారు. గతంలో చిరు వ్యాపారులు చిన్న బండ్లు పైన, స్కూటీ లపైన అల్పాహారం పెట్టుకొని రోడ్డు ప్రక్కన విక్రయించేవారు. దీని వలన ట్రాఫిక్ అంతరాయం, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన గుంటూరు పట్టణ ఎస్పీ వ్యాపారులు అందరిని ఒకచోట చేర్చే. వారి చేత ఫుడ్ కోర్టులను ప్రారంభించారు.

గుంటూరు హిందూ కళాశాల కూడలి వద్ద రెండు రోజులు క్రితం ప్రారంభించిన ఫుడ్ కోర్టులు వలన ఏదైనా సమస్యలు ఉన్నాయా అని ఆయన వాటిపైన ఎస్పీ ఆరా తీశారు. ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా , నగరవాసులకు ఇబ్బందులు తలెత్తుకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు , పోలీస్ సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం నడుపుతున్న ఫుడ్ కోర్టుల ఉపయోగకరంగా ఉంటే మరో ఫుడ్ కోర్టు ప్రారంభించడానికి అనుమతి ఇస్తామని ఎస్పీ తెలిపారు. నగరవాసులు అందరూ కూడా పోలీసులకు సహకరించాలని ఆయన తెలిపారు.

Body:విజువల్స్....

Conclusion:
Last Updated : November 20, 2019 at 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.