తెనాలిలో ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్​.. ఎందుకంటే..!

author img

By

Published : Jan 22, 2023, 9:56 AM IST

Five teachers suspended in tenali

Five teachers suspended in tenali: గుంటూరు జిల్లా తెనాలిలోని ఎన్ఎస్ఎం మున్సిపల్ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల విద్యార్థులు వారి తల్లితండ్రులతో కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన నేపథ్యంలో విచారణ చేసిన డీఈఓ విధుల్లో అలసత్వం వహించారన్న ఆరోపణలతో ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయులపై వేటు

Five teachers suspended in Tenali: అది ఒక్క ప్రభుత్వ పాఠశాల.. అక్కడ పిల్లలకు మాత్రమే ఆటలు ఆడుకోవడం.. వ్యాయామం చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఓ ప్రజా ప్రతినిధి ఆ స్కూల్​ను తన జిమ్​గా మార్చుకున్నాడు. మరొకరూ, పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్..​ ఈయన రోజు పాఠశాలలో తిష్ట వేసి పాఠశాల కొనసాగుతున్న సమయాల్లో అక్కడే ఉంటున్నారు. ఇదే అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలోని ఉపాధ్యాయులను పలుమార్లు ప్రశ్నించారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంతా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ పిల్లలు పాఠశాలలో పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలంటూ రోడ్డు మీద బైఠాయించి నరసన తెలిపారు. విషయం తెలుసుకున్న డీఈఓ శైలజ విచారణ చేపట్టి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే స్కూల్​లో ఇతరులు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు గుర్తించారు. అందుకు బాధ్యులైన ఐదుగురు ఉపాధ్యాయులను విధులనుంచి తొలగించి, మరో ఇద్దరిని వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఘటన తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయులపై డీఈఓ శైలజ సస్పెండ్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్​లో ఎన్ఎస్ఎఫ్ పురపాలక ఉన్నత పాఠశాలలో ఇటీవల విద్యార్థులు వారి తల్లితండ్రులు తమ సమస్యలు పరిష్కరించాలని స్కూల్ కాంపౌండ్​లో నిరసన చేపట్టారు. ఇదే అంశంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. డీఈవో శైలజ నేతృత్వంలో విచారణ చేపట్టారు. పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్​తోపాటూ.. ఆ ప్రాంత కౌన్సిలర్ పాఠశాల నిర్వహణ విషయంలో మితిమీరిన జోకింగ్ చేసుకుంటున్నారని విద్యాశాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

పాఠశాల నిర్వహణలో చోటు చేసుకునే లోటుపాట్లను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని తేలింది. పాఠశాల పనివేళల్లో పీఎంసి చైర్మన్ అక్కడే ఉంటున్నారని ఆ ప్రాంత కౌన్సిలర్ అక్కడే జిమ్ ఏర్పాటు చేసుకొని నిత్యం వ్యాయామం చేస్తున్నాడని తెలింది. అక్కడ జరుగుతున్న ఘటనలు పాఠశాలకు విరుద్ధంగా ఉన్నట్లు డీఈఓ గుర్తించారు. పాఠశాల నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే, ఉపాధ్యాయులు తమ దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రసూన, నాగమ్మ, సోమశేఖర్, సంపూర్ణ, కోటిరెడ్డి అనే ఐదుగురు ఉపాధ్యాయులపై సస్పెండ్ వేటు వేశారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.