తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి పవర్​ కట్​.. బయటే విధులు

author img

By

Published : Jan 19, 2023, 6:05 PM IST

Tenali Tehsildar Office

Tenali Tahsildar Office: గుంటూరు జిల్లా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మూడేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదని విద్యుత్ సిబ్బంది తెలిపారు. కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారుల ఇబ్బందులు చూసి.. తహసీల్దార్ సిబ్బందితో కలిసి బయట కూర్చొని విధులు నిర్వర్తిస్తున్నారు.

Tenali Tahsildar Office: ఏళ్ల తరబడి విద్యుత్ బకాయిలు పెండింగ్​లో ఉండడంతో తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే... తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయానికి చెందిన విద్యుత్ బిల్లులను గత మూడేళ్లుగా చెల్లించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లైన్​మెన్​ విద్యుత్ సరఫరా నిలిపివేశారు.. దీంతో కార్యాలయంలోని విద్యుత్ సేవలు నిలిచిపోయాయి.

ఇప్పటివరకు తహసీల్దార్ కార్యాలయం.. విద్యుత్ శాఖకు మొత్తం 32లక్షల 62వేల 592రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్​ సరఫరా లేకపోవడంతో వివిధ పనుల మీద కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తహసీల్దార్ రవిబాబు తన సిబ్బందితో కార్యాలయం బయట కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు.

తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేత.. బయటే కూర్చొని విధులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.