కామన్వెల్త్ క్రీడల్లో తెలుగమ్మాయి సత్తా.. పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం

కామన్వెల్త్ క్రీడల్లో తెలుగమ్మాయి సత్తా.. పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం
Commonwealth powerlifting games: న్యూజిలాండ్‌లో జరిగిన కామన్వెల్త్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలో గుంటూరుకు చెందిన జ్ఞాన దివ్య సత్తా చాటింది. 84 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. 150 కేజీల బరువును ఎత్తి జ్ఞాన దివ్య నూతన రికార్డును నమోదు చేసింది.
Commonwealth powerlifting games: న్యూజిలాండ్‌లో జరుగుతున్న కామన్ వెల్త్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలుగమ్మాయి సత్తా చాటింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం కటేవరం గ్రామానికి చెంది జ్ఞానదివ్య బంగారు పతకం సాధించారు. 84 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచారు. టర్కీలో జరిగిన ప్రపంచ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, కేరళలో జరిగిన జాతీయ పోటీల్లో 150 కేజీల బరువు ఎత్తి రికార్డు నెలకొల్పారు.
నాగం జ్ఞాన దివ్య స్థానికంగా ఉన్న మాతృశ్రీ క్రీడా ప్రాంగణంలో కోటేశ్వరరావు, రామిరెడ్డి, సుభాన్ వలి వద్ద శిక్షణ పొందారు. బంగారు పతకం సాధించిన జ్ఞాన దివ్యను గ్రామస్థులు అభినందించారు.
ఇవీ చదవండి:
