TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Dec 4, 2022, 4:59 PM IST

top news

.

  • ఎన్నో విశిష్టతలకు ఆంధ్రప్రదేశ్‌ నెలవు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
    President Draupadi Murmu Ap Tour: ‍‌దేశ భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ది అసాధారణ భాగస్వామ్యం కావాలని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో విశిష్టతలకు ఆంధ్రప్రదేశ్‌ నెలవని అన్నారు. పోరంకిలో పౌరసన్మాన కార్యక్రమం తర్వాత రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయని.. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ‘మార్గదర్శి’కి కళంకం ఆపాదించే కుట్ర.. ఆరోపణలను తిప్పికొట్టిన యాజమాన్యం
    Margadarshi: ‘మార్గదర్శి’కి కళంకం ఆపాదించాలనే కుట్రతోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ నిరాధార ఆరోపణలు చేశారని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ఖాతాదారుల్లో భయోత్పాతం సృష్టించి మార్గదర్శి ప్రతిష్ఠను దెబ్బతీయడమే వారి అసలు లక్ష్యమని వెల్లడించింది. నిప్పులాంటి నిజాలతో, సహేతుక వివరణలతో ప్రతీ ఆరోపణను తిప్పికొట్టింది. వ్యాపార నిర్వహణలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని మార్గదర్శి స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 13న జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
    Cabinet meeting: ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతుందనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తెలుగు నేల ఉన్నంత వరకు.. ఘంటసాల పాట నిలిచి ఉంటుంది: మంత్రి రోజా
    Minister Roja: తెలుగు నేల ఉన్నంత వరకు ఘంటసాల పాట నిలిచి ఉంటుందని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన.. జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన జీవితం యువతకు ఆదర్శమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏనుగుల మధ్య ఫైట్​ చూసి బెంబేలెత్తిన గ్రామస్థులు
    అసోంలో ఏనుగుల గుంపులు హల్​చల్​ సృష్టించాయి. అడవిలో ఉండే కొన్ని వందల ఏనుగులు పంట పొలాల్లోకి ప్రవేశించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటూ స్థానికులకు కనిపించాయి. ఈ ఘటన నగావ్​ జిల్లాలో జరిగింది. పోట్లాడుకునే గజరాజులను చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఈ గుంపులు ఆహారం కోసం స్థానిక పంట పొలాల్లోకి ప్రవేశించినట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హాస్టల్​ గదిలో ఉరేసుకుని LAW విద్యార్థిని ఆత్మహత్య
    ఉత్తర్​ప్రదేశ్​లో న్యాయవిద్య చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం హాస్టల్​ గదిలోనే ఉరివేసుకుని చనిపోయింది.
    ఉత్తర్​ప్రదేశ్​లో విషాదకర ఘటన జరిగింది. న్యాయవిద్య చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం తాను ఉంటున్న హస్టల్​ గదిలోనే ఉరి వేసుకుని చనిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇరాన్ 'హిజాబ్'​ వివాదంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నైతిక పోలీసు వ్యవస్థ రద్దు
    హిజాబ్‌కు వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగిన వేళ ఇరాన్‌ సర్కారు ఎట్టకేలకు దిగివచ్చింది. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హిజాబ్‌ చట్టాల అమలు కోసం 2005లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హిజాబ్‌ సరిగ్గా ధరించలేదని మాసా అమీని అనే యువతిపై నైతిక పోలీసులు దాడి చేయగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పిల్లల భవితకు భరోసా.. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేయండిలా..
    పిల్లలు ఉన్నత చదువులు చదవాలి అనే కోరిక ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. అందుకే, వీలైనంత మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయిస్తూ.. భవిష్యత్‌ ఖర్చులకు సిద్ధంగా ఉంటారు. విద్యా ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దీనికి మించి రాబడి ఆర్జించే మార్గాల్లో మదుపు చేయాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగ్లాదేశ్​కు​ టార్గెట్​ ఫిక్స్​.. మెరిసిన రాహుల్​
    బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్​ 186 పరుగులకు ఆలౌటైంది. టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్‌ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లగేజ్‌ మిస్‌.. విమాన సిబ్బంది తీరుపై రానా ఫుల్​ సీరియస్​!
    ఒక ప్రైవేట్​ ఎయిర్​లైన్స్​పై సినీ నటుడు రానా ఫుల్​ సీరియస్​ అయ్యారు. అదొక చేదు అనుభవమని అన్నారు. అసలేం జరిగిందంటే?
    ఒక ప్రైవేటు విమానయాన సంస్థ సిబ్బంది తీరుపై నటుడు రానా అసహనం వ్యక్తం చేశారు. తన లగేజ్‌ మిస్ అయిందని, స్టాఫ్‌ దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇలాంటి చెత్త అనుభవం తనకెప్పుడూ ఎదురవలేదన్న రానా.. ఆ సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.