Amaravati Farmers: భాజపా నేతలకు అమరావతి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?: రాజధాని రైతులు

Amaravati Farmers: భాజపా నేతలకు అమరావతి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?: రాజధాని రైతులు
Amaravati Farmers: అమరావతిలో పాదయాత్ర చేస్తున్న భాజపా నేతలకు నిరసన సెగ తగిలింది. జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మందడం దీక్షా శిబిరంలో మాట్లాడుతుండగా అమరావతి రైతులు అడ్డుకున్నారు. భాజపాకు అమరావతి ఇప్పుడు గుర్తుకువచ్చిందా అని.. రైతులపై కేసులు పెట్టినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ మాటలు వినే తాము భూములిచ్చామని రైతులు తెలిపారు.
BJP Amaravati Tour: గుంటూరులో "మనం-మన అమరావతి" పేరుతో భాజపా నిర్వహిస్తున్న పాదయాత్రలో అమరావతి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మధ్యాహ్న భోజనానికి మందడంలో ఆగిన రామకృష్ణపై అమరావతి రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. భాజపా నేతలకు అమరావతి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా.. అంటూ నిలదీశారు. మహిళలపై ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారన్నారు. ఉద్యమ సమయంలో రైతులపై కేసులు పెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. దిల్లీని మించిన రాజధానిని కడతామని చెప్పిన మోదీ వ్యాఖ్యలు ఏమయ్యాయని రైతులు అడిగారు.
BJP leader Adinarayana Reddy: జగన్కు ఓట్లు వేస్తే..: కరోనా కంటే జరోనాతోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోతోందని భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి అన్నారు. 'మనం-మన అమరావతి' పేరుతో గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఐనవోలు-మందడం మధ్య తవ్విన రోడ్డును ఆయన పరిశీలించారు. మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతుల వాణిని దిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే రైతులను మోదీ, అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లి.. అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పించేందుకు సిద్ధమన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు వేయకపోయినా ఫర్వాలేదని.. జగన్కు వేస్తే మాత్రంఇంకా నష్టపోతారని రైతులకు చెప్పారు.
ఇవీ చదవండి:
