మెడికల్​ షాపులోకి దూసుకొచ్చిన కారు.. ఐదుగురికి గాయాలు

author img

By

Published : Sep 18, 2021, 8:45 PM IST

అకస్మాత్తుగా మెడికల్​ దుకాణంలోకి దూసుకొచ్చిన కారు..ఐదుగురికి గాయాలు

నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రదేశంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అంతేనా ఓ మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. అంతకు ముందు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం తెనాలి పట్టణంలోని మున్సిపల్ మార్కెట్లో జరిగింది.

గుంటూరు జిల్లా తెనాలి.. మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలలోకి ఒక కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. నేరుగా ఓ మెడికల్ దుకాణంలోకి దూసుకొచ్చింది. ఫలితంగా షాపులో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక వృద్ధుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న రెండవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వాహనాన్ని స్టేషన్​కు తరలించారు. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకు ముందు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో.. బైక్ పూర్తిగా ధ్వంసమైంది. కాగా ఈ ఘటనలో రూ. లక్షా 50 వేల ఆస్తి నష్టం జరిగిందని మెడికల్ షాపు​ యజమాని రమేష్​ తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.

అకస్మాత్తుగా మెడికల్​ దుకాణంలోకి దూసుకొచ్చిన కారు..ఐదుగురికి గాయాలు



ఇదీ చదవండి: ఈ అరాచక ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్నావు చిన్నా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.