గాడిద పాలతో వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. ఓ సాఫ్ట్​వేర్ ఇంజనీర్​ సక్సెస్​ స్టోరీ..​

author img

By

Published : Sep 6, 2022, 2:01 PM IST

DONKEY MILK FARMING

DONKEY MILK FARMING : చదువుకోకపోతే గాడిదలు కాచుకోవడానికి కూడా పనికిరావు.. అంటూ పిల్లల్ని పెద్దలు హెచ్చరించడం విన్నాం. కానీ ఆ గాడిదలు పెంచుతూ లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు అని నిరూపిస్తున్నాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఏకంగా 100కి పైగా గాడిదల్ని పోషిస్తూ.. లక్షల్లో ఆదాయం ఆర్జీస్తున్నాడు మనోడు. వినూత్న ఆలోచనను సరైన ఆచరణలో పెడితే అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చని అంటున్నాడు ఈ యువకుడు.

MILK FARMING OF DONKEYS : సాధారణంగా గాడిదను అందరు గొడ్డు చాకిరి చేసే జంతువుగానే చూస్తారు. కానీ గాడిదపాలల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దల ద్వారా విన్నాడు మనోడు. ఆ మాటలను పట్టుకుని పలువురు వైద్య నిపుణులను సైతం సంప్రదించాడు మనోడు. అలా తన కుమారుడి సమస్య పరిష్కరంతోపాటు ఈ వినూత్న ప్రయోగానికి నాంది పలికాడు ఈ వ్యక్తి.

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కిరణ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని కొడుకు ఉబ్బసం సమస్యతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో గాడిదపాలు పట్టిస్తే తగ్గుతుందని తెలిసిన వారు సలహా ఇచ్చారు. దాంతో గాడిద పాలు తాపించాడు కిరణ్‌. ఆ క్రమంలో తన కొడుకు సమస్య నుంచి ఉపశమనం పొందడం గుర్తించాడు కిరణ్‌. అదే సమయంలో గాడిద పాలు ఖరీదుగా ఉండటం అతన్ని ఆలోచింప జేసింది. అలా గాడిదల్ని పెంచాలని నిర్ణయించుకున్నాడు మనోడు.

అందులో భాగంగానే గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ వంటి వివిధ రాష్ట్రాలకి వెళ్లి గాడిదల్ని కొనుగోలు చేశాడు మనోడు. రాజానగరం మండలం మల్లంపూడిలో 10 ఎకరాల పొలం లీజుకు తీసుకొని గాడిదల ఫాం ప్రారంభించాడు. దానికి అక్షయ డాంకీ ఫాం అని పేరు పెట్టాడు కిరణ్. ఈ ఫాంలో గుజరాత్ కు చెందిన అలారీ, మహారాష్ట్రకు చెందిన కాట్వాడ్, ఆఫ్రికాకు చెందిన ఇథోపియాతోపాటు స్థానిక రకాలకు చెందిన 120 గాడిదలు పెంచుతున్నాడు ఈ యువ సాఫ్ట్‌వేర్‌.

ప్రస్తుత్తం మార్కెట్‌లో గాడిద పాలు లీటరు 5 నుంచి 7 వేల వరకు ధర పలుకుతోంది. మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు పలుదేశాల్లో ఉన్న కంపెనీలకు ఈ పాలను సరఫరా చేస్తున్నారు. ఈ పాల నుంచి తయ్యారు చేసే ఫన్నీరుకి యూరోపియన్‌ దేశాల్లో మంచి గీరాకీ ఉంది అంటున్నారు. గాడిద పాలను పితికి లీటరు సీసాల్లో పోసి ఢీఫ్రీజర్‌ లో పెడతారు. ఈ పాలను ఐస్‌బాక్స్‌లో పెట్టి వారానికోసారి ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తారు.

గాడిదల పాలతో వ్యాపారం.. లక్షలు గడిస్తున్న ఓ సాఫ్ట్​వేర్​

నాణ్యమైన వాటిని కొనుగోలు చేయడంతో ఒక్కో గాడిదకి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వెచ్చించారు . వాటి పోషణ చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే గాడిదల పోషణ, ఫాం నిర్వహణకు సిబ్బందిని నియమించుకున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ పాలు తాగడంవల్ల ఇమ్యునిటీ పెరుగుతుందని అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు ఫాం మేనేజర్‌.

గాడిద పాలు లీటరు వేలల్లో ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే గాడిదల ఫాం పెట్టటానికి మొదట ఇంట్లో వారే అభ్యంతరం చెప్పారు. సహచరులు, తెలిసిన వారు ఎగతాళి కూడా చేశారు. అయినా గాడిదల గురించి పూర్తి సమాచారం తెలుకొని.. పాలకున్న డిమాండ్ దృష్ట్యా పెంపకం ప్రారంభించారు. ప్రస్తుతం పాల విక్రయంపైనే దృష్టిపెట్టిన యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. భవిష్యత్ లో గాడిదల పాల పొడి కూడా తయారు చేస్తామని చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.