రత్నం పెన్ అండ్ సన్స్ అధినేత రమణమూర్తి కన్నుమూత

author img

By

Published : Sep 20, 2021, 7:35 PM IST

Updated : Sep 21, 2021, 10:01 AM IST

rathnam pen

19:33 September 20

రత్నం పెన్ అండ్ సన్స్ అధినేత రమణమూర్తి కన్నుమూత

                మహాత్ముడి స్వదేశ ఉద్యమ స్ఫూర్తితో ఊపిరి పోసుకున్న రత్నం పెన్నుల తయారీ సంస్థ వారసుడు, రెండో తరానికి చెందిన కె.వి.రమణమూర్తి(80) సోమవారం కన్నుమూశారు. రమణమూర్తి తండ్రి వెంకటరత్నం 1932లో రాజమహేంద్రవరంలో సంస్థను స్థాపించారు.అఖిల భారత ఖాదీ గ్రామీణ సంస్థ కార్యదర్శి కుమరప్ప 1933లో ఈ సంస్థను సందర్శించి రెండు పెన్నులు తీసుకెళ్లారు. వాటిలో ఒక పెన్నును గాంధీజీకి అందజేశారు. దానిని చూసి అభినందిస్తూ బాపూజీ లేఖ రాశారు. సి.వై.చింతామణి, న్యాపతి సుబ్బారావు పంతులు, రామనాథ్‌ గోయంకా ఈ పెన్నులు వాడి ప్రశంసించారు. రాష్ట్రపతులు బాబురాజేంద్రప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి.గిరి, శంకర్‌ దయాళ్‌శర్మ, ప్రధానులునెహ్రూ, లాల్‌బహుదూర్‌శాస్త్రి, ఇందిర..పలువురు గవర్నర్లు ఈ పెన్నులు వాడారు. 1981లో వెంకటరత్నం మరణించాక.. ఆయన కుమారుడురమణమూర్తి సంస్థ బాధ్యత చేపట్టి ప్రగతిబాట పట్టించారు. 2019లో జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ భారత్‌వచ్చినపుడుప్రధాని మోదీ రత్నం పెన్ను ఆమెకు బహుమతిగా అందించడం గమనార్హం.రమణమూర్తి మృతికి ఎంపీ భరత్‌,స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చందన నాగేశ్వర్‌ సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి:

సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు

Last Updated :Sep 21, 2021, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.