Todays Temperatures వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి ధవళేశ్వరంలో అత్యధికంగా 468 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ ఎండలకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ధవళేశ్వరం 468 డిగ్రీలుప్రకాశం జిల్లా గుండ్లపల్లి 467 డిగ్రీలుశ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 465 డిగ్రీలుబాపట్ల జిల్లా అమృతలూరులో 464 డిగ్రీలుకోనసీమ జిల్లా మండపేటలో 463 డిగ్రీలుగుంటూరు జిల్లా తాడికొండలో 463 డిగ్రీలుకాకినాడ జిల్లా సీతంపేటలో 462 డిగ్రీలుకృష్ణా జిల్లా కోడూరులో 462 డిగ్రీలుఏలూరు జిల్లా ఏదులగూడెంలో 46 డిగ్రీలుఎన్టీఆర్ జిల్లా పుట్రేలలో 459 డిగ్రీలునెల్లూరు జిల్లా పెద్దారెడ్డిపల్లెలో 459 డిగ్రీలుపల్నాడు జిల్లా విజయపురిలో 458 డిగ్రీలుపార్వతీపురం జిల్లా కురుపాంలో 454 డిగ్రీలుతిరుపతి జిల్లా సత్యవేడులో 454 డిగ్రీలునంద్యాల జిల్లా పాములపాడులో 452 డిగ్రీలువిజయనగరం జిల్లా గొల్లపాడులో 451 డిగ్రీలుపగో జిల్లా తణుకులో 451 డిగ్రీలుఅల్లూరి జిల్లా నువ్వుమామిడిలో 45 డిగ్రీలుఅనకాపల్లి జిల్లా మాడుగులలో 45 డిగ్రీలునిర్మానుష్యంగా రోడ్లు విజయవాడలో ఎండలు మండుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఎండకు భయపడి అత్యవసర పనులకు మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు ఇంటి వద్దనున్న వారి సైతం ఎండ తీవ్రత వేడి గాలులకు అవస్థలు పడుతున్నారు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు ఉష్ణోగ్రతలు ఒక్కోరోజు ఒక్కో స్థాయిలో నమోదవుతున్నాయి నగరంలో గత రెండు రోజులుగా సుమారు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రోడ్లకి ఇరవువైపులా చెట్లు లేకపోవడంతో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం లేదని ప్రజలు చెబుతున్నారు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు ఎండ తీవ్రత దృష్ట్యా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు ఎండ తీవ్రతను తట్టుకోలేక శీతలపానీయాలు అధిక మొత్తంలో ప్రజలు తాగుతున్నారు నగరంలోని ప్రధాన కూడళ్లు బస్ స్టాప్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారుఎండల వల్ల జరుగుతున్న ప్రమాదాలు ఆ సూర్యప్రతాపానికి విజయవాడ కృష్ణ లంకలో ఓ సెల్‌టవర్ దగ్ధమైంది మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎండ తీవ్రతకు గుంటూరు ఆటో నగర్ దగ్గర ఆర్టీసీ బస్సు టైరు పేలింది డ్రైవర్ అప్రమత్తతో బస్సును నియంత్రించడం వల్ల ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు వడదెబ్బతో ముగ్గురి మృతి వడదెబ్బతో కృష్ణా జిల్లా గుడివాడలో ఇద్దరు మృతి చెందారు ఆర్టీసీ బస్టాండు సమీపంలో పట్టణంలోని బాపూజీ నగర్‌కు చెందిన ఎండీ రెహ్మాన్ 45 సోమవారం మధ్యాహ్నం మృతి చెందగా ఇందిరా నగర్ కాలనీ ప్రాంతానికి చెందిన సూరగాని సురేష్ 38 సోమవారం మధ్యాహ్నం కార్మికనగర్ ఎదురుగా ఉన్న రైస్‌మిల్లు పక్కన పడిపోయాడు అతను వడదెబ్బతో పడిపోయి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం గొడ్డు వెలగల పంచాయతీ జీడిమేకలపల్లికి చెందిన అన్వర్‌బాషా65 సోమవారం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై మరణించాడువేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎండా కాలం ప్రమాదాల నుంచి బయటపడాలంటే నిపుణులు సూచనలు తప్పక పాటించాలి పగటి వేళ ఎండలో తిరగకూడదు తప్పనిసరి అయితే తప్ప పగటి పూట బయటకు వెళ్లకండి వీలైెనంత వరకు ఇంట్లోనే ఉండండి మజ్జిగ కొబ్బరి నీళ్లు పళ్ల రసాలు తరచూ తీసుకోవాలి వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బ తగిలే అవకాశాలు అధికం కాబట్టి ఎండలో వెళ్లినప్పుడు గొడుగు వెంట తీసుకు వెళ్లడం మంచిది అలాగే తెల్లటి వస్త్రాలు టోపీ ధరించి వెళ్లాలి ఎండాకాలంలో ప్రత్యేకంగా చిన్నపిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారుఇవీ చదవండిYSR Mastyakara Bharosa ఏ మత్స్యకార కుటుంబం ఇబ్బంది పడకూడదనేదే నా తపన సీఎం జగన్Interview with Traveler Sampath విశాఖ కుర్రాడు సైకిల్‌పై దేశాన్ని చుట్టేస్తున్నాడుSteel Plant Workers Protest విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మిక సంఘాలు