ap rains: వానలు ఆగినా.. తప్పని కష్టాలు

author img

By

Published : Nov 23, 2021, 9:47 AM IST

Updated : Nov 23, 2021, 10:56 AM IST

వానలు

ap rains: వానలు ఆగినా చాలా చోట్ల వరుణుడు మిగిల్చిన కష్టాలు కొనసాగుతున్నాయి..! కొన్ని గ్రామాలు..ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇప్పటికీ చాలాచోట్ల మునిగిన కాలనీలు, వీధులు దర్శనమిస్తున్నాయి.! చాలాచోట్ల జనం కట్టుబట్టలతో మిగిలిపోయారు..! చిత్తూరు జిల్లాలో రాయలచెరువు పరిధిలోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కడప, నెల్లూరు జిల్లాల్లోని వరద బాధితులూ ఇంకా ముంపు నుంచి తేరుకోలేదు.

వాన కష్టాలు

ap rains: చిత్తూరు జిల్లాలో వర్షం ఆగి రెండ్రోజులు గడిచినా చాలా గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. రహదారులు కోతకు గురై చాలాగ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జిల్లాలో సుమారు 30 వేలమందిపై వరద ప్రభావం చూపింది. రాయలచెరువుకు చిన్న గండి పడడంతో రామచంద్రాపురం, తిరుపతి గ్రామీణ మండలాల పరిధిలోని 16 గ్రామాల్లో14 వేల 960 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. వరద బాధితులు కట్టుబట్టలతో వచ్చినాపశువుల్ని వదిలేసి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాయలచెరువుకు గండి పడిన ప్రాంతాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించి తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండి పూడ్చేందుకు ఐఐటీ నిపుణుల సలహా తీసుకుంటున్నామని, వీలైనంత త్వరగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరులో వరద పీడిత ప్రాంతాలనుమంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ కుమార్ పరిశీలించారు. సహాయక చర్యలు సహా... విద్యుత్ సరఫరా పునరుద్ధణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దగ్గర ప్రవాహంతో నేలమట్టమైన శివాలయాన్నితెలుగు రాష్ట్రాల దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కమలానంద భారతి పరిశీలించారు.

కడపజిల్లాలో...

కడప జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న అద్దాలమర్రి బ్రిడ్జిని కాంగ్రెస్ నేతతులసిరెడ్డి సందర్శించారు. అతివృష్టికి.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోడై.. భారీ నష్టానికి కారణమైందని విమర్శించారు.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం

Last Updated :Nov 23, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.