'సాంకేతికతతో వస్త్ర ఉత్పత్తి రంగంలో నూతన అధ్యాయానికి నాంది'

author img

By

Published : Sep 17, 2021, 10:27 PM IST

MLA Roja

ఏకాంబరకుప్పంలో పవర్ ​లూమ్​ వీవింగ్ మెషిన్​లలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మెషిన్లతో యూనిట్​ను, శిక్షణా శిబిరాన్ని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. హిందూపూర్​లో మాత్రమే ఉన్న ఈ సాంకేతికత ఏకాంబరకుప్పంలో మొదటిసారిగా ప్రవేశపెట్టామని తెలిపారు.

చిత్తూరు జిల్లా ఏకాంబరకుప్పంలో పవర్ ​లూమ్​ వీవింగ్ మెషిన్​లలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మెషిన్లతో యూనిట్​ను, శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాటిని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.

వస్త్ర ఉత్పత్తి రంగంలో ఒక నూతన అధ్యాయానికి ఈ సాంకేతికత నాంది పలుకుతుందని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన జెకార్డ్ మెషీన్​లతో పవర్ లూమ్స్ కలిపి వీవింగ్ చేయడం వలన ఉత్పత్తి, నాణ్యతా సామర్థ్యం పెరుగుతుందని రోజా అన్నారు. అంతేకాకుండా వీవర్స్​కు ఆదాయం రెట్టింపు అవుతుందని తెలిపారు.

రాష్ట్రంలోని హిందూపూర్​లో మాత్రమే ఉన్న ఈ సాంకేతికత మన నగరి ఏకాంబరకుప్పంలో మొదటిసారిగా ప్రవేశపెట్టామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. మెషిన్లు, ముడి సరుకులనూ అందిస్తామని తెలిపారు. వారు తయారు చేసిన ఫాబ్రిక్​ను మార్కెటింగ్​తో పనిలేకుండా తిరిగి తీసుకుంటారని తెలియజేశారు.

ఇదీ చదవండి: TDP: చిత్తూరు జిల్లాలో 'రైతు కోసం తెదేపా'..పలుచోట్ల ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.