కుమార్తె పుట్టినరోజుకు కేకు ఆర్డర్‌ ఇచ్చి వస్తూ.. తండ్రి అనంతలోకాలకు

author img

By

Published : Nov 20, 2022, 2:53 PM IST

Road Accident

Father died on Daughter's Birday: కుమార్తె పుట్టినరోజు కావడంతో కేకు ఆర్డర్‌ ఇచ్చి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందాడు. ఆ విషయం తెలియక తండ్రి కేకు తీసుకుని వస్తాడని చిన్నారి ఎదురుచూస్తుండటం స్థానికులను కలిచివేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Road Accident: తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రామన్నపాలేనికి చెందిన జయరాజు కుమారుడు రవి(30) కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్​కు వచ్చి గోల్కొండ, రామ్‌దేవ్‌గుడాలో అద్దెకు ఉంటున్నారు. విప్రో కంపెనీలో ఎలక్ట్రీషియన్​గా పని చేస్తున్నాడు. ఇద్దరు సంతానం. శనివారం కుమార్తె పుట్టినరోజు కావడంతో సాయంత్రం నార్సింగిలోని ఓ బేకరీలో కేకు ఆర్డర్‌ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. తారామతి, బారాదరి వద్దకు రాగానే ముందున్న వాహనాన్ని దాటబోయి బైక్‌పై నుంచి కిందపడ్డాడు.

ఘటనలో రవి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిస్తే భార్య స్పందన ఎలా ఉంటుందోనని వెంటనే చెప్పేందుకు పోలీసులు వెనుకాడారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.