ముగ్గురుగా వచ్చారు..ఇద్దరుగా వెళ్లారు..చాకచక్యంతో తండ్రిని కాపాడిన కుమార్తె..అసలేం జరిగిందంటే
Published: Sep 12, 2023, 11:40 AM


ముగ్గురుగా వచ్చారు..ఇద్దరుగా వెళ్లారు..చాకచక్యంతో తండ్రిని కాపాడిన కుమార్తె..అసలేం జరిగిందంటే
Published: Sep 12, 2023, 11:40 AM

Boy Dies after Slipping in Koneru at Ramakuru: ముగ్గురుగా వచ్చారు.. ఇద్దరుగా వెళ్లారు. ఎందుకు అలా జరిగింది? ఎందుకిలా చేశారు? ఓ తండ్రి, ఓ కొడుకు, ఓ కూతురు ముగ్గురు దైవ దర్శనం కోసం వచ్చారు కానీ ఇద్దరు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్లారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే బాపట్ల జిల్లా చీరాలకు వెళ్లాల్సిందే..
Boy Dies after Slipping in Koneru at Ramakuru : బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు గ్రామంలోని శివాలయం కొనేరులో ఓ బాలుడి మృత దేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పరిశీలించి ప్రమాదశాత్తు జరిగిన ఘటనగా భావించి మృతి చెందిన బాలుడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచారు. దీంతో విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించి జరిగిన తీరుని ఎస్సై తిరుపతిరావుకి వివరించారు.
అసలేం జరిగిందంటే.. ఎస్సై తిరుపతిరావు మాటల్లో: బాపట్ల జిల్లా చీరాల పట్టణానికి చెందిన దామర్ల రామకృష్ణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మదీన శిల్క్స్ వస్త్ర దుకాణంలో సేల్స్ మాన్గా పని చేస్తుంటారు. తన కుమారుడు, కుమార్తెలతో కలసి శనివారం జిల్లాలోని జె.పంగులూరు మండలం రామకూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి దైవ దర్శనం కోసం, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చారు. రామకృష్ణ ప్రతి సంవత్సరం ఈ మాసంలో ఈ ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వస్తుంటాడు. అయితే తన భార్యకు హృదయ సమస్య ఉండటంతో ఆమెని తీసుకురాలేదు.
వీరు వచ్చిన సమయానికి ఆలయం వెనుక భాగంలో ఉన్న కోనేరు కొందరు యువకులు ఈత కొడుతున్నారు. వారిని చూసి తాను కూడా ఈత కొడతానని తండ్రిని అడగడంతో సరే అని ఈ అక్కడ ఉన్న వారికి పరిచయం చేసి జాగ్రత్తలు చెప్పి తన కూతురుతో పక్కన కూర్చున్నారు. కోనేరులో స్నానం ముగించుకొని బాలుడు సాయి అఖిల్(10) అందరితో తిరిగి వచ్చారు. తరువాత తన కుమార్తె కోనేరులో కాళ్లూ చేతులు కడుగుకొని వస్తానని అడగటంతో తండ్రి రామకృష్ణ కుమార్తెని తీసుకొని కోనేరు వద్దకు వెళ్లాడు. అప్పటికే స్నానం చేసిన కుమారుడిని అక్కడ ఉండమని చెప్పాడు.
Daughter Saved Father From Koneru in Bapatla District : తండ్రి మాట లెక్క చేయకుండా కొండ వాలుగా ఉన్న పక్కకు వెళ్లాడు. అక్కడ పాచి పట్టి ఉండటంతో కాలుజారి 20 అడుగుల లోతుగల కోనేరులో (Children Died Accidentally) పడ్డాడు. కోనేరులో పడిన కుమారుడిని రక్షించేందుకు కోనేరులో దిగు తుండగా కాలు జారి తను కూడా ప్రమాద బారిన పడ్డాడు. అది గమనించిన కుమార్తె అనూశ్రీ (14) చాకచక్యంగా వ్యవహరించి తన చున్నీని తండ్రికి అందించి ఒడ్డుకు లాగింది. అక్కడ జరిగిన సంఘటనతో అనూశ్రీ అపస్మారక స్థితికి చేరుకుంది.
ఇరువురి పరిస్థితిని చూసిన తండ్రి బోరున విలపించారు. కొద్ది సేపటికి తెరుకున్న కుమార్తెను తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోయారు. మరుసటి రోజు కోనేరులో కాళ్లు కడుగుకునేందుకు వెళ్లిన స్థానికులు... బాలుడు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు.
తన తల్లికి తెలియకుండా చేయాలనే: రామకృష్ణ భార్య హృదయ సమస్యతో బాధపడుతోంది. భార్యకు కుమారుని మరణ వార్త తెలిస్తే తనకు ఏమౌతుందోనని భావించి.. విషయం తెలియకుండా ఉంచేందుకే తాము అలా వెళ్లిపోయామని రామకృష్ణ ఎస్సైకి తెలిపారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోష్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు.
Mother Died in a Road Accident తండ్రి చనిపోయి ఏడాది కాలేదు. రాఖీ కట్టించెందుకు పిల్లలతో వెళ్లి తల్లి మృతి!
