భాజపా పోరుయాత్రను అడ్డుకున్న స్థానిక వైకాపా నాయకులు..

author img

By

Published : Oct 3, 2022, 1:30 PM IST

WAR BETWEEN YSRCP AND BJP

అనంతపురం జిల్లాలో భాజపా పోరు యాత్ర చేస్తున్న నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలను భాజపా నేతలు ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో వైకాపా శ్రేణులు ఒక్కసారిగా భాజపా నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు.

WAR BETWEEN YSRCP AND BJP : అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దేవగిరిలో ఆదివారం నిర్వహించిన భాజపా ప్రజాపోరు యాత్రను స్థానిక వైకాపా నాయకులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోరుయాత్ర ముగింపు సందర్భంగా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న భాజపా నాయకులతో.. వైకాపా నాయకులు గొడవపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. భాజపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైకాపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

భాజపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందింటి శ్రీనివాసులు మాట్లాడుతుండగా.. వైకాపా నాయకులు అడ్డుకున్నారు. కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాంధీ జయంతి రోజున మద్యం తాగి వచ్చి.. గొడవకు దిగారని భాజపా నాయకులు ఆరోపించారు. ధైర్యముంటే నీతివంతంగా భాజపాను అడ్డుకోవాలని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు.

భాజపా పోరుయాత్రను అడ్డుకున్న స్థానిక వైకాపా నాయకులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.