పోలీసు ఇంటికే.. కన్నం వేసిన దొంగలు..!

పోలీసు ఇంటికే.. కన్నం వేసిన దొంగలు..!
Theft in head Constable house: చోరీలను అరికట్టే పోలీసు ఇంట్లోనే దొంగతనం జరిగింది. దీంతో.. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసే.. తమ ఇంట్లో దోచుకెళ్లారని పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది..! ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే?
Theft in head Constable house: అనంతపురు జిల్లా ఉరవకొండ పట్టణంలోని హెడ్‌కానిస్టేబుల్ బాలు ఇంట్లో గురువారం సాయంత్రం చోరి జరిగింది. ప్రస్తుతం ఆయన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయురాలైన భార్య విజయలక్ష్మి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి డిపార్టుమెంటల్ పరీక్ష రాయడానికి బుధవారం తాడిపత్రికి వెళ్లి.. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు.
ఇంట్లోకి వెళ్లి చూస్తే.. చోరీ జరిగినట్లు అర్థమైంది. దీంతో.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తాళం వేసిన ఇంట్లోకి చాకచక్యంగా చొరబడిన దొంగలు.. రెండు బీరువాల్లోని 4 తులాల బంగారం. కేజీ వెండి ఆభరణాలతోపాటు రూ.50వేలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు చోరి జరిగిన ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
