children mount climbing: పర్వతారోహణలో పదేళ్లు నిండని చిన్నారులు

author img

By

Published : Jul 29, 2021, 7:37 PM IST

childrens in mountaineering

పదేళ్లు కూడా నిండని చిన్నారులు.. మాములుగా అయితే..ఇంట్లో గారాలు పోతూ.. బడికి వెళ్లాలంటే బద్ధకిస్తూ.. ఆడుతూ.. పాడుతూ సరదాగా గడిపేస్తారు. కానీ అనంతపురం జిల్లాకు చెందిన ఐదుగురు చిన్నారులు మాత్రం పర్వతాలను అధిరోహిస్తూ.. ఔరా..! అనిపిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతో..శిక్షణ పొందుతూ ..వచ్చే నెల కిలిమంజారో ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

పర్వతారోహణలో చిన్నారులు

అనంతపురంలోని ఆర్​డీటీ సంస్థలో క్రీడా విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్న శంకర్‌ తన పెద్ద కూమార్తె రుత్వికశ్రీకి పర్వతారోహణలో ఆరునెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఆ బాలిక ఈ ఏడాది ఫిబ్రవరిలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఈ స్ఫూర్తితో ముందుకు వచ్చిన.. రుత్విక సోదరి భవ్యశ్రీతోపాటు.. మరో ముగ్గురు చిన్నారులకు శంకర్‌ శిక్షణ అందించారు. వీళ్లంతా ప్రస్తుతం కిలిమంజారో పర్వతాన్ని ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. శిక్షణలో భాగంగా ఈ నెల 15న లద్దాఖ్‌ లోని ఖర్దుంగ్‌ లా పర్వతాన్ని అధిరోహించారు.

ఐదే రోజుల్లో..

ఖర్దుంగ్‌ లా పర్వతాన్ని అధిరోహించి.. చిన్నారులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రెండు రోజులు లద్దాఖ్‌లో శిక్షణ పొంది.. ఐదు రోజుల వ్యవధిలో.. రోజూ తొమ్మిది గంటల పాటు నడుస్తూ.. పర్వతం ఎక్కేశారు. ఎవరెస్టు శిఖరం ఎక్కి.. దేశ గౌరవాన్ని పెంచటమే కాకుండా.. తమను ఆదరిస్తున్న ఆర్​డీటీ ఖ్యాతిని చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చిన్నారులు చెబుతున్నారు.

సొంత ఖర్చులతో..

చిన్నపిల్లలు కావటంతో పర్వతారోహణ సమయంలో డాక్టర్‌ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. చిన్నారుల శిక్షణ సమయంలో వారి పట్టుదలను గమనించిన ఆర్​డీటీ వైద్యుడు హిమచంద్ర.. తన సొంత ఖర్చులతో.. పిల్లలతో పాటు లద్దాఖ్‌ లో పర్వతారోహణ చేశారు. కిలిమంజారో ఎక్కేందుకు సిద్ధమవుతున్న చిన్నారులకు ఒక్కొక్కరికి కనీసం నాలుగు లక్షల రూపాయలు ఖర్చవుతుందని శిక్షకుడు చెబుతున్నారు.

ఇదీ చదవండీ.. DONKEYS MURDER: పొలంలోకి వచ్చి అరుస్తున్నాయని.. గాడిదలను చంపిన సైకో..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.