Rail roko: అనంతపురంలో రైల్‌ రోకో.. అన్నదాతలను అరెస్టు చేసిన పోలీసులు

author img

By

Published : Oct 18, 2021, 12:43 PM IST

Police intercepting farmers Rail Roko in ananthapur

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన రైల్‌ రోకోను పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆందోళన చేస్తున్న నిరసనకారులను అరెస్టు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా.. అనంతపురంలో రైలు రోకో నిర్వహించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలతో పోల్చిన రైతులు.. వాటిని రద్దు చేయాలని, లిఖింపూర్​లో రైతులను కారుతో ఢీకొట్టిన ఘటనకు బాధ్యున్ని చేస్తూ.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

రైలు రోకో నేపథ్యంలో రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. ఆందోళన కారులను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. ఈ ప్రభుత్వాలకు కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. కేంద్రం కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విశాఖ మన్యంలో అలజడి ... పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.