మీడియా కథనాలపై కోర్టును ఆశ్రయిస్తా: మంత్రి ఉషశ్రీ చరణ్
Updated on: Jan 18, 2023, 7:46 PM IST

మీడియా కథనాలపై కోర్టును ఆశ్రయిస్తా: మంత్రి ఉషశ్రీ చరణ్
Updated on: Jan 18, 2023, 7:46 PM IST
Minister Ushasri Charan: నిరాధార ఆరోపణలతో కథనాలు రాసేవారిని కోర్టుకు లాగుతానని.. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. కురాకులతోట ప్రాంతంలో జగనన్న కాలనీ భూ సేకరణలో క్విడ్‌ప్రోకో ఆరోపణలను ఆమె ఖండించారు.
Minister Ushasri Charan: రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె స్పందించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ, కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కొన్న భూములన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేసినవేనని ఆమె వెల్లడించారు. తన పట్ల అనుచిత కథనాలు రాస్తున్న వారిని కోర్టుకు లాగుతానని మంత్రి హెచ్చరించారు. కురాకులతోట ప్రాంతంలో జగనన్న కాలనీ భూ సేకరణలో క్విడ్‌ప్రోకో ఆరోపణలను ఆమె ఖండించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కుమారులు కొనడానికి ప్రయత్నం చేసిన భూములనే తమ వద్ద ఉన్న మనుషులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
