14 పంచాయతీల్లో వెలగని వీధి దీపాలు.. చీకట్లో ప్రజలు

author img

By

Published : Jan 19, 2023, 8:38 PM IST

Etv Bharat

Power Cut: విద్యుత్ నిత్యావసరంగా మారిన ఈ రోజుల్లో రెండు రోజులుగా అంధకారంలో ఉంటున్నారు అక్కడి ప్రజలు. బకాయిలు చెల్లించలేదంటూ అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని 14 పంచాయతీలు, ఉరవకొండ కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఫలితంగా అక్కడి వీధులు రాత్రిపూట చీకటిలో మగ్గుతున్నాయి.

14 పంచాయతీల్లో వెలగని వీధి దీపాలు.. చీకట్లో ప్రజలు

Power Cut: అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని 14 పంచాయతీలు కలిపి 7 కోట్ల రూపాయలకు పైగానే విద్యుత్‌ శాఖకు బకాయిపడ్డాయి. ఈ కారణంగా కనేకల్‌ మేజర్‌ పంచాయతీ, మాల్యం, గరుడచేడు, హులికెర, బ్రహ్మసముద్రం, కలేకుర్తి, జక్కలవజి తదితర గ్రామాల్లోని వీధిదీపాలకు విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు.

పంచాయతీలు బకాయిలు చెల్లించిన తర్వాత కరెంట్‌ పునరుద్దరిస్తామని తేల్చిచెప్పారు. ఫలితంగా రెండురోజుల నుంచి ఈ గ్రామాల్లో అంధకారం అలముకుంది. వీధుల్లో విద్యుత్ లేనందువల్ల విషపురుగులు, అడవి జంతువుల భయంతో కనేకల్‌ మండలంలోని గ్రామాల ప్రజలు రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

మా గ్రామంలో విద్యుత్ దీపాలు సరిగ్గా వెలగడం లేదు.. తేళ్లు, పాములు తిరుగుతున్నాయి.. ఎక్కడికైనా పోవాలంటే బాగా ఇబ్బందిగా ఉంది.. ఎవరిని అడిగినా సరిగ్గా పట్టించుకోవడం లేదు.. గ్రామ పంచాయితీలు స్ట్రీట్ లైట్​వి.. బకాయిలు ఉన్నాయంటా అవి కట్టలేదు.. -ఇస్మాయిల్, కనేకల్

రహదారులపైన లైట్లు కానీ వీధి దీపాలు కానీ ఏవీ సరిగ్గా వెలగలేదు.. స్థానికంగా ఆర్టీసీ బస్టాండ్​లో కూడా వెలగటం లేదు.. మండల కేంద్రంలో అడిగితే అధికారులు ఏ మాత్రం స్పందించకుండా.. విద్యుత్ అధికారులను అడిగితే.. పంచాయితీ అధికారులు బకాయిలు ఉన్నందున.. అది కట్టినట్లైతే విద్యుత్ సరఫరా చేస్తామంటున్నారు.. ఖలీల్, కనేకల్

ఉరవకొండ మేజర్‌ పంచాయతీ కూడా కోటి 18 లక్షలు రూపాయలు విద్యుత్‌ బిల్లుల బకాయి చెల్లించాల్సి ఉంది. ఇక్కడా వీధి దీపాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. ముఖ్యంగా అంబేడ్కర్ నగర్‌, శివరామిరెడ్డి కాలనీ, హమాలీ కాలనీ, పాతపేట, వీరశైవ కాలనీల్లో ఏ వీధి చూసిన చీకటిమయంగా మారింది. వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పంచాయతీ అధికారులు బకాయిలు వెంటనే చెల్లించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కనేకల్ మండలం వ్యాప్తంగా స్ట్రీట్ లైట్లే.. ఇదేనా అభివృద్ధి .. టౌన్​లోనే వచ్చినటువంటి స్ట్రీట్ లైట్ల పరిస్థితి..సామాన్య పల్లెల్లో మరి ఈ పరిస్థితి ఏలా ఉంటుందోనని ఒక్కసారి సీఎం జగన్మోహన్ గారిని మేము ప్రశ్నించుతున్నాను. గౌస్, సీపీఐ మండల కార్యదర్శి

ఇక్కడ పాములు వచ్చాయి.. మొన్న వీడియో కూడా చేశాము. మేము, పిల్లలు పోరాడే పరిస్థితి ఏర్పడింది.. చెట్లు, చీమలు దండిగా ఉన్నాయి.. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది.. బాధ్యతలు మీరే వహించాలి.. మా బాధలు చూసి మీరే కరెంట్​ను విడుదల చేయాలి.. సుజాతమ్మ, ఉరవకొండ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.