మంచానికి పరిమితమైన కుమారుడు.. ఇక అన్నీ తానై

author img

By

Published : Jun 19, 2022, 2:01 PM IST

fathers day

Father sacrifice life for Son: కుమారుడు పుట్టాడని ఎంతో సంతోషించాడు... కానీ అంతలోనే నిజం తెలుసుకుని బాధపడ్డాడు.. కొడుకు కాళ్లు వంకర తిరిగి జన్మించడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు.. కాళ్లొస్తాయేమోనని ఎంతో ఖర్చు చేశాడు... కానీ వైద్యులు చేతులెత్తేశారు.. ఇక కాళ్లు రావని, కుమారుడు నడవలేడని తెలిసి కుంగిపోయాడు... అయినా తన కొడుకుకు ఏ కష్టం రావొద్దని గుండె నిబ్బరం చేసుకున్నాడు.. అప్పటినుంచి తానే అన్నీ తానై సపర్యలు చేయడం మొదలుపెట్టాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు... మూడు దశాబ్ధాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. తన కుమారుడికి నెలనెలా దివ్యాంగ పింఛన్​ వస్తుందని.. మంచానికే పరిమితమైన కిడ్నీ సంబంధ రోగులకు ఇచ్చే విధంగా పెన్షన్​ ఇస్తే ఆసరాగా ఉంటుందని ఆ తండ్రి కోరుతున్నాడు.

కుమారుడికి అల్పాహారం తినిపిస్తున్న తండ్రి ఆదిబాబు

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. తల్లి తన ప్రేమను బిడ్డపై కురిపిస్తే.. ఏ కష్టం రాకుండా చూసుకునే వాడే తండ్రి. పిల్లల జీవితం సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు తమ సంతోషాలను త్యాగం చేస్తారు. పాడేరు పట్టణానికి చెందిన భార్యభర్తలు ఆదిబాబు, స్వాతి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. మండల పరిషత్తు కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మూడో సంతానంగా కొడుకు కాళ్లు వంకర తిరిగి జన్మించడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చయ్యాయ్యే తప్ప ఫలితం లేదు. అవిటితనాన్ని సరిదిద్దడం కష్టమని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో వెనుదిరిగారు. చిన్నతనం నుంచి మంచానికే పరిమితమైన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటూ వస్తున్నారు.

కూలి పనులు చేసుకుంటూ..: ఉదయాన్నే నిద్ర లేవడం... కుమారుడి కాలకృత్యాలు తీర్చడం... స్నానం చేయించి అల్పాహారం అందించడంతో వారి దినచర్య మొదలవుతోంది. ఎండెక్కిన తర్వాత జీవనోపాధి నిమిత్తం కూలి పనులకు వెళ్తూ వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నెలనెలా దివ్యాంగ పింఛను వస్తోందని, మంచానికే పరిమితమైనవారికి కిడ్నీ సంబంధ రోగులకు ఇచ్చినట్లు నెలకు రూ.పది వేలు పింఛనుగా ఇస్తారని తెలియడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు ఆదిబాబు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.