భారత ఆటగాళ్లకు పాకిస్థాన్​లో ఘనమైన ఆతిథ్యం

author img

By

Published : Sep 13, 2021, 8:28 PM IST

From vegetarian food to extra security, Pakistan taking extra care of India's budding tennis players

ఆసియా​ అండర్​-12 టెన్నిస్​ టోర్నీ ఆడేందుకు పాకిస్థాన్​ చేరుకున్న భారత బృందానికి ఘనమైన ఆతిథ్యం లభిస్తుంది. తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా పాక్​ అధికారులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారని భారత బృందం కోచ్​లు వెల్లడించారు.

ఆట ఏదైనా భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్​ ఉంటుంది. దాంతో పాటు దాయాదుల మధ్య పోరును చూసేందుకు ఎంతోమంది క్రీడాఅభిమానులు ఆశగా ఎదురుచూస్తారు. 1964 తర్వాత డేవిస్ కప్​ టెన్నిస్​ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ఒక్క సీనియర్​ అథ్లెట్​ కూడా పాకిస్థాన్​లో అడుగుపెట్టలేదు. లాహోర్​ వేదికగా 2007 నవంబరులో చివరిసారిగా పాకిస్థాన్​ వేదికగా ఫ్రెండ్​షిప్​ సిరీస్​ జరిగింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎలాంటి క్రీడా టోర్నీలు జరగలేదు.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అండర్​-12 బాలబాలికల టెన్నిస్​ టోర్నీని పాకిస్థాన్​ నిర్వహించింది. పాక్​లో జరుగుతున్న ఆసియా అండర్​-12 ఐటీఎఫ్​ క్వాలిఫయింగ్​ ఈవెంట్​లో పాల్గొనేందుకు 8 మంది భారత టెన్నిస్​ క్రీడాకారులు వెళ్లారు. శత్రుదేశంగా పరిగణించే పాక్​లో తమకు గౌరవ మర్యాదలకు ఎలాంటి ఢోకా లేదని భారత బృందానికి చెందిన కోచ్​లు అంటున్నారు. తమ బృందాన్ని పాక్​ అధికారులు ఎంతో ప్రత్యేకంగా పరిగణిస్తున్నారని తెలిపారు.

బాలుర జట్టులో ఆరవ్​ చావ్లా, ఓజాస్​ మెహ్లావత్​, రుద్ర భాతమ్​ ఉండగా.. బాలికల టీమ్​లో మాయా రేవతి, హర్షిత శ్రీ వెంకటేశ్​, జాన్హవీ కజ్లా ఉన్నారు. అయితే 2007లో జరిగిన ఫ్రెండ్​షిప్​ సిరీస్​లో పాల్గొన్న నేషనల్​ టెన్నిస్​ ఛాంపియన్​ అశుతోష్​ సింగ్​ బాలుర జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్​లో తమకు అతిథి మర్యాదలు ఘనంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

"ఈ టోర్నీలో పాల్గొనేందుకు దోహా ఎయిర్​పోర్ట్​లో దిగిన తర్వాత.. మా జెర్సీలపై ఉన్న తివర్ణ పతాకాన్ని చూసిన ఓ బృందం ఎంతో ఆసక్తిగా గమనించింది. వాళ్లు మాతో మాట్లాడేందుకు ఎంతో ఉత్సాహం కనబరిచారు. మేం ఇస్లామాబాద్​ వెళ్లేందుకు అక్కడున్న ఇమిగ్రేషన్​ డెస్క్​కు చేరుకునే లోపే పాకిస్థాన్​ టెన్నిస్​ సమాఖ్య మాకు క్లియరెన్స్​ తీసుకుంది. హోటల్​ చేరుకునే వరకు ఎస్కార్ట్​ వాహనాలను ఏర్పాటు చేశారు. ఇస్లామాబాద్​లో భద్రతా సమస్యలేమి మాకు తలెత్తలేదు. క్రీడాకారుల తల్లిదండ్రులూ ఎంతో ధైర్యంగా ఉన్నారు. టెన్నిస్​ క్రీడతో రాజకీయాలతో పోల్చలేదు".

- అశుతోష్​ సింగ్, బాలుర జట్టు కెప్టెన్​

టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్​ వెళ్లిన తమను ఘనమైన ఆతిథ్యం లభిస్తుందని చెబుతున్నారు బాలికల బృందం కోచ్​ నమితా బల్​. "మాకు సంబంధించిన చిన్నచిన్న విషయాలపై కూడా వీరంతా ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. మా టీమ్​లో జన్హవీ శాకాహారి. ఆమె కోసం ప్రతిరోజూ అదే రకమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాక్టీస్​లో మాకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. పాకిస్థాన్​ ఆతిథ్యం మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది. వాళ్లు మమ్మల్ని ఏమాత్రం శత్రువుల్లాగా భావించడం లేదు. రోజుకు 10 సార్లు మా వద్దకు వచ్చి.. ఏదైనా సహాయం కావాలా? అంటూ మమ్మల్ని ప్రత్యేకంగా భావిస్తున్నార"ని ఆమె చెప్పింది.

ఈ టోర్నీలో భారత బృందం విజయవంతంగా కొనసాగుతుంది. నవంబరులో కజకిస్థాన్​ వేదికగా జరగనున్న తర్వాతి రౌండ్​కు ఇప్పటికే టాప్​-2 టీమ్స్​ చేరుకున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్​లో నేపాల్​ టీమ్​ను బాలుర జట్టు 3-0తో ఓడించగా.. పాకిస్థాన్​ టీమ్​పై బాలికల బృందం 2-1తో గెలుపొందింది.

అండర్​-12 టోర్నీనే కాకుండా భారత సీనియర్​ టెన్నిస్​ ఆటగాళ్లతో ఆడేందుకు తమ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారని పాకిస్థాన్​ టెన్నిస్​ ఫెడరేషన్​ అధ్యక్షుడు సలీమ్​ సైఫుల్లా ఖాన్​ వెల్లడించారు.

ఇదీ చూడండి.. PCB Chairman: 'టీమ్ఇండియాతో సిరీస్​ ఆలోచనే లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.