జకోవిచ్​కు ఉపశమనం.. సోమవారం వరకు అక్కడే..

author img

By

Published : Jan 6, 2022, 3:29 PM IST

novak djokovic

Djokovic Australian Open 2022: ఆస్ట్రేలియా ఓపెన్​లో పాల్గొనేందుకు వెళ్లిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్​కు ఘోర అవమానం జరిగింది. వ్యాక్సినేషన్​ విషయంలో స్పష్టతలేని కారణంగా ఆస్ట్రేలియా అధికారులు అతడి వీసాను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన జకోవిచ్​కు ఉపశమనం లభించింది.

Djokovic Australian Open 2022: ప్రపంచ నంబర్​వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్​ వీసా రద్దు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించని కారణంగా జకోవిచ్‌ను నిలిపిపేసినట్లు ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన సెర్బియా ఆటగాడికి ఉపశమనం లభించింది. జకోవిచ్​ను వెంటనే తిరిగివెళ్లమనకూడదని.. సోమవారం వరకు అతడు మెల్​బోర్న్​లో ఉండొచ్చని సంబంధిత కోర్టు తీర్పు ఇచ్చింది.

తొలుత.. ఆస్ట్రేలియా ఓపెన్​లో పాల్గొనేందుకు మెల్​బోర్న్​ చేరుకున్నాడు జకోవిచ్. అయితే.. వ్యాక్సినేషన్​కు సంబంధించిన విషయంలో స్పష్టత లేని కారణంగా అతడి వీసాను రద్దు చేశారు అధికారులు. ఫలితంగా 8 గంటలపాటు అతడు మెల్​బోర్న్​ విమానాశ్రయంలోనే ఉండిపోయాడు.

కాగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఉన్న జకోవిచ్‌ ఇప్పటికే 9 సార్లు 'ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌' టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.

ఇదీ చదవండి:

Australian Open 2022: జకోవిచ్​పై వీడిన ఉత్కంఠ

Novak Djokovic: అలా చేయకపోతే జకోవిచ్‌ ఇంటికే..!

Australia Open Djokovic: జకోవిచ్​కు ఘోర అవమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.